ఐపియల్ స్కామ్: గురునాథ్ గొంతు ధ్రువీకరణ

ముంబై: ఐపియల్ ఫిక్సింగ్ కుంభకోణం విషయంలో ట్యాప్ చేసిన సంభాషణలకు సంబంధించ గురునాథ్ మేయప్పన్ వాయిస్ సాంపుల్‌ను ధ్రువీకరించారు. ఐపియల్ ఫిక్సింగ్, అవినీతి కుంభకోణంపై దర్యాప్తునకు వేసిన ముకుల్ ముద్గల్ కమిటీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక పాత్ర వహించే ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ వాయిస్ సాంపిల్స్‌ను గుర్తించినట్లు తెలిపింది. ఈ మేరకు ఎన్డిటీవీలో ఓ కథనం అచ్చయింది.

ఎన్డీటివి కథనం ప్రకారం - ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) 2013 ఎడిషన్ సందర్భంగా మేయప్పన్‌కు, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్ మధ్య సంభాషణ జరిగింది. ఈ పరిణామం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

IPL spot-fixing scandal: Gurunath Meiyappan’s voice sample confirmed in tapped conversation, says report

2013 ఐపియల్ సందర్భంగా వచ్చిన బెట్టింగ్ ఆరోపణల్లో ముంబై పోలీసులు 2013లో గురునాథ్ మేయప్పన్‌ను అరెస్టు చేశారు. ముద్గల్ కమిటీ తన నివేదికను నవంబర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. మేయప్పన్‌పై వచ్చిన బెట్టింగ్ ఆరోపణలు నిజమేనని సంభాషణల ద్వారా తేలిందని ఎన్డీటివీ వ్యాఖ్యానించింది.

మేయప్పన్ బుక్కీలకు సమాచారం అందిస్తూ బెట్టింగ్‌కు కూడా పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. రెండు సార్లు ఐపియల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు టీమ్ ప్రన్సిపాల్‌గా మేయప్పన్ వ్యవహరించారు. సూపర్ కింగ్స్ యజమాని కొంతకాలం బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న ఎన్ శ్రీనివాసన్ అల్లుడు మేయప్పన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+