ఐపీఎల్ కు కావేరీ సెగ: 4 వేల మంది పోలీసులు, నలుపు రంగు షర్టులు, టియర్ గ్యాస్ !
చెన్నై: కర్ణాటక- తమిళనాడు కావేరీ నదీ జలాల పంపిణి వివాదం సెగ చెన్నైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తాకనుంది. చెన్నైలో మంగళవారం జరిగే చెన్నై-కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ను అడ్డుకుంటామని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు హెచ్చరించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వచ్చే క్రికెట్ అభిమానులకు అనేక ఆంక్షలు విధించారు.

సీఎంబీ కోసం పట్టు !
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు (సీఎంబీ) ఏర్పాటు చేస్తేనే తమిళనాడు రైతులకు న్యాయం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు గత కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు.

కావేరీ
సూపర్ స్టార్ మనవి మేనేజ్ మెంట్ బోర్డు కోసం తాము పోరాటం చేస్తున్న సమయంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ లు ఏర్పాటు చెయ్యడం ఏమిటని, వెంటనే రద్దు చెయ్యాలని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తే చెన్నై జట్టు సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి క్రికెట్ మ్యాచ్ ఆడి నిరసన వ్యక్తం చెయ్యాలని రజనీకాంత్ మనవి చేశారు.

రంగంలోని బీసీసీఐ
చెన్నైలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐపీఎల్ మ్యాచ్ లు సవ్యంగా జరిగే విధంగా బీసీసీఐ చర్యలు తీసుకుంది. తమిళ సంఘాల ఆందోళన పిలుపుతో చెన్నై నగర పోలీసు కమిషనర్ ఏకే. విశ్వనాథ్, డిప్యూటీ పోలీసు కమిషనర్ సారంగన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అభిమానులకు నిబంధనలు
చెన్నైలోని చెపాక్స్ లోని ఎంఏ. చిదంబరం స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వచ్చే అభిమానులు నలుపు రంగు దస్తులు వేసుకుని వస్తే లోపలికి అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, చార్టులు, పెన్నులు నిషేధించామని అధికారులు తెలిపారు.

4 వేల మంది పోలీసులు
చెపాక్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 4 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లోని రహదారుల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారిని తనిఖీలకు సహకరించాలని పోలీసు అధికారులు మనవి చేశారు. ఐదు టియర్ గ్యాస్ సెక్యూరిటీ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఐపీఎల్ మ్యాచ్ లు సవ్యంగా జరగడానికి పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications