KL Rahul: కేఎల్ రాహుల్ ఇదేం నాయకత్వం సామి.. సోషల్ మీడియాలో ట్రోల్స్..

కేఎల్ రాహుల్(KL Rahul) భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కానీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అతను ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జరిగిన మ్యాచ్ లో రాహుల్ ఆట కానీ, ప్రవర్తన కానీ చూస్తే నాయకత్వ లక్షణాలేవి లేనట్లు కనిపించాయి. అతను ఫీల్డింగ్ లో గాయపడొచ్చు.. అతన బ్యాటింగ్ ఓపెనర్ గా రావడానికి ఇబ్బంది పడొచ్చు కానీ.. జట్టు గెలిచే అవకాశం ఉన్న సమయంలో అతను చేతులెత్తయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

అతను 8వ వికెట్ గా దిగి జట్టును గెలిపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అతను చివర్లో వచ్చి కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. అదే రాహుల్ ముందు వచ్చే సింగిల్స్, టూడిలు తీయుకున్నా.. ఫోర్ల, సిక్స్ లతో లక్నో సూపర్ జెయింట్స్ ను గెలిపించే అవకాశం ఉంది. కానీ రాహుల్ అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. నాయకుడంటే.. జట్టును ముందుండి నడిపించాలి.. కష్టలొచ్చిన ఎదురొడ్డి నిలవాలి కానీ.. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ల కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమయ్యాడు. రాహుల్ గతంలో పంజాబ్ కింగ్స్ కు కూడా నాయకత్వం వహించాడు.

KL Rahul

కేఎల్ రాహుల్ స్థానంలో ఎంఎస్ ధోనీ ఉంటే అతను గాయపడినా.. జట్టును ముందుకు తీసుకెళ్లి గెలిపించేవాడని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. కేఎల్ రాహుల్ పై సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఎల్ఎస్జీ 19.5 ఓవర్లకు అలౌట్ అయింది. కాగా ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లి గొడవ పడిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ వివాదంపై బీసీసీఐ సీరియస్ గా స్పందించింది. వారికి జరిమానా విధించింది. విరాట్ కోహ్లికి రూ.1.07 కోట్లు, మెంటార్ గౌతమ్ గంభీర్ రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హక్ కు రూ.1.79 లక్షలు జరిమానా విధించింది. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.అయితే బీసీసీఐ చెబుతున్నట్లు ఆటగాళ్లు ఎవరూ కూడా ఈ డబ్బులు చెల్లించరనేది చాలా మందికి తెలియని విషయం. ఇదే కాదు స్లో ఓవర్ రేట్ కారణంగా విధించే జరిమానాలను కూడా ఫ్రాంచైజీలే భరిస్తాయట. "ఆటగాళ్లు రూపాయి కూడా జరిమానాగా విధించరని.. చాలా మందికి ఈ విషయం తెలియదని" పీటీఐ జర్నలిస్ట్ కుషాన్ సర్కార్ తన ట్విటర్ వేదికగా తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+