ఎస్పీ ఆత్మహత్యాయత్నం: సూసైడ్ పై గూగుల్‌లో సెర్చ్ చేశారు...ఆపై ఎలుకలమందు తాగాడు
లక్నో: తూర్పు కాన్పూర్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సురేంద్ర కుమార్ దాస్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. వివాహం ఇష్టంలేక తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆయన పరిస్థితి మరింత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 36 గంటలు గడిస్తేకానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు అడిషనల్ డీజీపీ అవినాష్ చంద్ర తెలిపారు.
ఎక్మోపై సురేష్ కుమార్ దాస్‌కు చికిత్స అందిస్తున్నారు. విషం తీసుకున్న పేషంట్ల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిన సమయంలోనే ఎక్మోపై ఉంచి చికిత్స అందిస్తారని అడిషనల్ డీజీపీ అవినాష్ చంద్ర తెలిపారు. ముంబై నుంచి ప్రత్యేక ఎక్విప్‌మెంట్ తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. ముంబై నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా స్థానిక డాక్టర్లకు సహకారం అందించేందుకు వచ్చారు.

ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎస్పీ రాతను ధృవీకరించేందుకు నిపుణుల దగ్గరకు పంపినట్లు పోలీసులు చెప్పారు. భార్యతో విబేధాలతోనే తాను ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా ఎస్పీ సురేంద్ర కుమార్ దాస్ డిప్రెషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలనే ఆయన ఆత్మహత్యలపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు సమాచారం. ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని వాటిని చంపేందుకు ఎలుకల మందు తీసుకురావాల్సిందిగా పనిమనిషికి చెప్పినట్లు ఎస్‌ఎస్పీ చెప్పారు.
ఎస్పీ సురేంద్ర కుమార్ దాస్ తన భార్యతో విబేధాలు వచ్చాయని గత 40 రోజులుగా తన తల్లితో కూడా మాట్లాడటం లేదని ఎస్ఎస్పీ వివరించారు. త్వరలోనే తన భార్యను కూడా విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications