ఫేస్‌బుక్‌లో మహిళా అధికారి జోరు, కామెంట్స్(ఫోటో)
తిరువనంతపురం: కేరళకు చెందిన ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెప్ యొక్క ఫోటో ఫేస్‌బుక్‌లో బాగా షేర్ అవుతోంది. ఆమె కొచ్చిలో రెండు వారాల పాటు శిక్షణ కోసం వచ్చి వెళ్లారు. ఆమె మంచి లుక్ కలిగి ఉన్నారు. దీంతో ఆమె ఫోటో బాగా షేర్ అవుతోంది. ఆమె చేతిలో అరెస్టు అయినా అభ్యంతరం లేదనే కామెంట్లు కూడా పెడుతున్నారని చెబుతున్నారు.
ఆమె కొచ్చికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలుకుతూ ఫేస్‌బుక్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే పదివేల లైక్స్ వచ్చాయి. ఈ ఫోటో వాట్సప్‌లో కూడా బాగా షేర్ అవుతోంది. చాలామంది ఆమె కెరీర్ బాగుండాలని విష్ చేస్తున్నారు.

మెరీన్ జోసెప్ రెండు వారాల ఐపీఎస్ శిక్షణ కోసం కొచ్చి వచ్చారు. ఆమె కొచ్చిలో శిక్షణకు వచ్చి తిరిగి వెళ్లి పోయారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ముహమ్మద్ రఫిక్ చెప్పారు. ఈమె ఇటీవలె వై20 పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లే యువ బృందానికి కూడా ఎంపికయ్యారు.
మెరీన్ జోసెఫ్ 2012లో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే సాధించారు. ఈమె ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి తన బీఏ హానర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం కేరళలో ఇద్దరు మలయాళీ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఒకటి ఆర్ శ్రీలేఖ, రెండోవారు. బీ సంధ్య.












Click it and Unblock the Notifications