రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక.. మారిన నిబంధనలు!
రైళ్లలో ప్రయాణించే నిబంధనలను భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తోంది. మారిన నిబంధనల గురించి అందరూ పూర్తి సమాచారం తెలుసుకోవడం తప్పనిసరి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి రైల్వేశాఖ కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటిల్లో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ఉన్నాయి. రైలు అటెండర్లు, టీటీఈ, క్యాటరింగ్ సిబ్బంది, రైళ్లలో పనిచేసే ఇతర రైల్వే ఉద్యోగులకు కూడా ఇవి వర్తిస్తాయి. ధూమపానం, మద్యం సేవించడం లేదంటే ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొంటే IRCTC నుండి తీవ్రమైన జరిమానాలను బహుమానంగా తీసుకోవాల్సి ఉంటుంది.
IRCTC కొత్త నియమాలు..
* ప్రయాణికులు హెడ్ ఫోన్స్ లేకుండా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినకూడదు.
* తమ సీట్లు, కంపార్ట్ మెంట్లు లేదంటే కోచ్ లో ఫోన్ లో మాట్లాడే సమయంలో తోటి ప్రయాణికుకు వినపడేలా పెద్ద పెద్ద శబ్ధాలు చేయకూడదు.

* రాత్రి 10.00 గంటల తర్వాత ప్రయాణికులను టికెట్లు చూపించమని టీటీఈ అడగకూడదు.
* గ్రూపులుగా ప్రయాణం చేస్తుంటే రాత్రి 10.00 గంటల తర్వాత పెద్దగా మాట్లాడకూడదు
* మిడిల్ బెర్త్ ప్రయాణికులు తమ సీట్లు ఎప్పుడైనా తెరుచుకోవచ్చు. దీనికి సంబంధించి లోయర్ బెర్త్ ప్రయాణికులు వారిపై ఎటువంటి ఫిర్యాదు చేయకూడదు.
* రాత్రి 10.00 గంటల తర్వాత ఆహారాన్ని సరఫరా చేయరు. అయితే భోజనాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి ఇ-కేటరింగ్ సేవలు పొందేలా అనుమతి ఉంటుంది.
* ఏసీ కోచ్‌లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుడు, ప్రయాణికురాలు 70 కిలోల వరకు సరుకులను తీసుకువెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల వరకు ఉచితం. స్లీపర్‌లో 80 కిలోలు, సెకండ్ క్లాస్ లో 70 కిలోలతోపాటు అదనపు బ్యాగేజీ ఛార్జీలతో 150 కిలోల లగేజీకి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications