ఎమ్మెల్యే కూతురికి అశ్లీల మెసేజ్.. యువకుడిపై అనుచరుల ఎటాక్..

అథణి తాలూకా ఉగార కుర్దా గ్రామానికి చెందిన వివేక్ శెట్టి ఫేస్ బుక్ ఖాతా నుంచి ఓ అమ్మాయికి అశ్లీల మెసేజ్ వెళ్లింది.

బెంగుళూరు: ఇంటర్నెట్ అందరి జీవితాల్లోకి చొరబడ్డాక.. స్నేహాలు, ప్రేమలు, పరిచయాలు.. ఇలా ప్రతీది సామాజిక మాధ్యమాల వేదికగానే జరిగిపోతోంది. అయితే ఉపయోగించుకునే తీరును బట్టి సామాజిక మాధ్యమాల వల్ల కొందరికి మేలు జరుగుతుండగా.. దుర్వినియోగం చేసేవారు మాత్రం అభాసుపాలు గాక తప్పదు.

తాజాగా కర్ణాటకలోని బెళగావి జిల్లా కాగవాడ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అథణి తాలూకా ఉగార కుర్దా గ్రామానికి చెందిన వివేక్ శెట్టి ఫేస్ బుక్ ఖాతా నుంచి ఓ అమ్మాయికి అశ్లీల మెసేజ్ వెళ్లింది. అయితే ఆ అమ్మాయి తండ్రి స్థానిక ఎమ్మెల్యే కావడంతో.. విషయం తెలుసుకున్న ఆయన దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు.

Irked over Facebook comments, BJP MLA's daughter beat up youth in Karnataka

తన కుమార్తెకు అసభ్య మెసేజ్ పంపినందుకు గాను జనవరి 1న ఉదయం 8 గం.కు రాజుకాగె సోదరుడు అతని అనుచరులను, కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని వివేక్ శెట్టి ఇంటికెళ్లాడు. వివేక్ శెట్టితో పాటు అతని తల్లి మీద కూడా దాడి చేశారు. ప్రస్తుతం తల్లికొడుకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో వివేక్ శెట్టి కాలు విరిగినట్టుగా సమాచారం.

అయితే ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజుకాగె స్పందన కోరగా.. అబ్బే అదేమి లేదన్నారు. వివేక్ శెట్టి తనకు తెలిసిన వ్యక్తేనని అతని మీద తమవాళ్లెవరూ దాడి చేయలేదని అన్నారు. తమ కుమార్తె ఫేస్ బుక్ ఖాతాకు అశ్లీల మెసేజ్ వచ్చిందన్న సంగతి కూడా తనకు తెలియదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+