ఫ్యాషన్ డిజైనర్‌కు తప్పిన ప్రమాదం: కారు ముందు అద్దంలోకి దూసుకొచ్చిన ఇనుప రాడ్డు
ముంబై: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రింకు జైన్ తృటిలో ప్రమాదం తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న క్యాబ్ ఓ చోట ఆగి ఉండగా ఒక్కసారిగా పై నుంచి ఓ ఇనుప రాడ్డు కారు ముందు అద్దంలోనుంచి దూసుకొచ్చింది. ఆ సమయంలో రింకూ జైన్ డ్రైవర్ సీట్ పక్కనే ఉన్న సీటులో కూర్చుంది. రింకూ జైన్, ఆమె బంధువు ఒకరు గోరేగావ్‌లో షాపింగ్ చేసుకుని క్యాబ్‌లో బయలు దేరారు. జేగేశ్వరి ప్రాంతంలోని ఫ్లై ఓవర్ కిందకు కారు చేరుకోగానే ఒక్కసారిగా ఇనుప రాడ్డు పైనుంచి కారు అందంలోకి దూసుకొచ్చింది.
ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఇనుప రాడ్ కారులోకి ఎలా దూసుకొచ్చిందో తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఓ భవనం నిర్మాణం జరుగుతోందని అక్కడినుంచి రాడ్డు జారి కారుపైకి పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు పోలీసులు.

మంగళవారం తనకు కొంచెం పని ఉంటే తాను దక్షిణ ముంబై వెళ్లాల్సి వచ్చిందని రింకూ జైన్ చెప్పింది. ఆ సమయంలో తన వద్ద చాలా లగేజీ ఉన్నిందని చెప్పింది. తన కారు పనిచేయకపోవడంతో ఊబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకుని గోరేగావ్ నుంచి బయలు దేరినట్లు చెప్పుకొచ్చింది. కారు పై నుంచి ఒక్కసారిగా రాడ్దు దూసుకురావడంతో భయపడిపోయామని చెప్పింది. ముందు సీట్లో కూర్చున్న తనకు వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిందని...తన ముక్కుకు రాడ్డు తాకి ఉండేదని రింకూ జైన్ చెప్పింది. ఘటన తన కళ్ల ముందు ఇంకా మెదులుతోందని రింకూ చెప్పింది.

-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications