శశికళకు పరోక్షంగా సహాయం చేస్తున్న దీపా: పన్నీర్ తో కలిస్తేనే, లేదంటే !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా పన్నీర్ సెల్వంను పక్కన పెట్టి ఒంటరిగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే పరోక్షంగా శశికళ వర్గానికి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా పన్నీర్ సెల్వంను పక్కన పెట్టి ఒంటరిగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే పరోక్షంగా శశికళ వర్గానికి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ కే నగర్ లో అన్నాడీఎంకే పార్టీకి తిరుగేలేదు. ఆర్ కే నగర్ లో ఆ పార్టీ బలమైన నాయకులతో పాటు కార్యకర్తల అండ ఉంది. అయితే అధికారంలో ఉన్న శశికళ వర్గీయులు, ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వ పెద్దలు ఎత్తులు పై ఎత్తులు వేసి అన్నాడీఎంకే ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

పన్నీర్ సెల్వం మద్దతు తీసుకుంటే దీపా ఆర్ కే నగర్ నుంచి గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే పన్నీర్ సెల్వంను కాదంటే ఆయన వర్గం మరో అభ్యర్థిని రంగంలోకి దింపితే అన్నాడీఎంకే కార్యకర్తలు మూడు వర్గాలుగా చీలిపోతారు.

Is Deepa indirectly helping Sasikala by contesting R.K.Nagar by election?

తమిళనాడులో ప్రధాన పత్రిపక్షం అయిన డీఎంకే పార్టీ ఆర్ కే నగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో అక్కడ విజయం సాధిస్తే పరిస్థితి తారుమారుఅయిపోతుందని అంటున్నారు. పన్నీర్ సెల్వం, దీపా అమ్మ అభిమానుల ఓట్లు చీల్చుకుంటే పరోక్షంగా శశికళ వర్గానికి కలిసి వచ్చే అవకాశం ఉంది.

డీఎంకే ఓట్లు కచ్చితంగా ఆ పార్టీకే పడుతాయి. ఇక మైనారిటీలను ఆకర్షించడానికి కాంగ్రెస్ సిద్దం అయ్యింది, డీఎండీకే, పీఎంకే, సీపీఎం, బీజేపీ సైతం అక్కడ అభ్యర్థులను బరిలోకి దించితే అన్నాడీఎంకే కార్యకర్తలు గందరగోళంలో పడిపోతారు.

దీపా, పన్నీర్ సెల్వం వర్గీలు కలిసి శశికళకు చెక్ పెట్టాలని స్థానిక అన్నాడీఎంకే నాయకులు, అక్కడి కార్యాకర్తలు అంటున్నారు. అయితే దీపానే స్వయంగా వెళ్లి పన్నీర్ సెల్వం మద్దతు కోరితే ఆలోచించే అవకాశం ఉందని, మా నాయకుడే స్వయంగా వెళ్లి దీపాకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+