హీరో విజయ్ తమిళనాడు భావి ముఖ్యమంత్రా?
చెన్నై: ఇళయదళపతి, తమిళ సూపర్ స్టార్ విజయ్ కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రా? అనే చర్చ సాగుతోంది. అందుకు ఓ కారణం ఉంది. హీరో విజయ్ తండ్రి వ్యాఖ్యలే అందుకు కారణమని చెబుతున్నారు.
జరుగుతోన్న ప్రచారం మేరకు... విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఇటీవల తన కొడుకుకు ఓ సలహా ఇచ్చాడు. నీకు 50 ఏళ్లు వచ్చే వరకు పూర్తిగా నటన పైనే దృష్టి సారించమని ఈ 'కత్తి' హీరోకు తండ్రి సూచించాడని ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో ఓ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు విజయ్ ఆసక్తి కనబర్చుతున్నాడని, దీంతో ఆ తండ్రి పై వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు. విజయ్‌కు ప్రజా సేవ మక్కువ అంటున్నారు. తద్వారా రాజకీయాల పైన ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు.

ఈ దిశగా.. ఇటీవల ఓ సర్వే కూడా చేశారని అంటున్నారు. తమిళనాడులో దాదాపు 75 శాతం మంది విజయ్ పట్ల సానుకూలంగా ఉన్నారని, విశ్వాసం వ్యక్తం చేశారని తెలుస్తోంది. తమిళనాడు భవిష్యత్తు నేత విజయ్ అని చాలామంది భావిస్తున్నారని అంటున్నారు.
తమిళనాడులో రాజకీయంగా సానుకూలంగా మార్పులు తీసుకు వచ్చే సినీ తారలు అనే పాయింటుతో సర్వే చేశారని అంటున్నారు. ఎవరు రాజకీయాల్లో ప్రవేశించాలని ప్రజలు కోరుకుంటున్నారో సర్వే చేశారు. ఇందులో విజయ్ వైపు చాలామంది మొగ్గు చూపారని అంటున్నారు.












Click it and Unblock the Notifications