తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పాలన సాధ్యమేనా? న్యాయ నిపుణులు చెప్తుందిదే!!
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పాలన సాగించడం సాధ్యమేనా? దేశ రాజధాని ఢిల్లీని పాలిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ జైలు జీవితానికి సంబంధించి ప్రతి అనుమతి కోర్టు నుంచి తీసుకుంటున్న వేళ ఆయన ఢిల్లీని ఏ విధంగా జైలు నుంచి పాలిస్తారు? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి.
తీహార్ జైల్లో కేజ్రీవాల్ పరిస్థితి ఇలా
కేజ్రీవాల్ సీఎంగా కొనసాగటం, సాధ్యాసాధ్యాలపై న్యాయనిపుణులు ఏమంటున్నారు? చట్టం ఏం చెబుతుంది? ప్రస్తుతం తెలుసుకుందాం.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీ ల్యాండరింగ్ కేసులో ఏప్రిల్ 15వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్ వస్తువుల దగ్గర నుండి, కలిసే మనుషుల వరకు ప్రతి ఒక్కటి కోర్టు అనుమతితోనే జరుగుతుంది.

న్యాయ నిపుణులు చెప్తుంది ఇదే
ఇక ఇలాంటి సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు కేంద్రంగా ఢిల్లీని పాలించడం సాధ్యమయ్యే విషయమేనా అంటే న్యాయ నిపుణులు ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు కేంద్రంగా ఢిల్లీని పాలించడం ఆచరణ అసాధ్యమని పలువురు న్యాయనిపుణులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగటం కష్టమని చెబుతున్నారు. అయితే జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపకూడదు అన్నది ఏ రాజ్యాంగంలోనూ, చట్టంలోనూ లేదని, కాకుంటే ఇది ఆచరణ అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కేసును ఉదాహరిస్తున్న న్యాయవాదులు
అందుకు సహేతుకమైన కారణాలను కూడా చెబుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు కేంద్రంగా తాను చేసే ప్రతి చర్యకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుందని, జైలులో ఆయన ఎటువంటి క్యాబినెట్ సమావేశాలకు పిలవలేరని చెబుతున్నారు. గతంలో పశుగ్రాసం కుంభకోణంలో లాలు ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సీఎంగా జైలు నుండి ప్రభుత్వాన్ని నడపవచ్చు అని భావించారు కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు.
అరెస్ట్ అయితే ముఖ్యమంత్రిగా కొనసాగకూడదని లేదు.. కానీ
దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ రాజీనామా చేసి తన భార్య రబ్రీ దేవికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారని గుర్తు చేస్తున్నారు.ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగకూడదని చట్టంలో ఎటువంటి నిషేధం లేదని, కాకుంటే జైలు నుంచి పాలన సాగించడం ఆచరణ సాధ్యం కానిదని చెబుతున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక ఎమ్మెల్యే దోషిగా నిర్ధారించిన తర్వాతనే మంత్రి పదవికి అనర్హుడిగా పరిగణించబడతాడని చెప్తున్నారు.
కేజ్రీవాల్ ఏం చెయ్యబోతున్నారు ?
కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ అయితేనే ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని చెబుతున్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ తరపున వాదిస్తున్న లాయర్లు మాత్రం జైలు నుంచి కేజ్రీవాల్ పరిపాలన చేయడం సాధ్యమనే వాదిస్తున్నారు. ఈ క్రమంలో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పాలన చేస్తారా? లేదా ప్లాన్ బీ అమలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications