Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ క్యాస్ట్ ఇష్యూ : మరి మీ కులమేంటీ ? అనంత్ హెగ్డేకు కాంగ్రెస్ ప్రశ్న.డీఎన్ఏ టెస్ట్ కు సిద్దమా ?

న్యూఢిల్లీ : బాలాకోట్ వైమానిక దాడులకు రుజువు చూపాలనే అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్దం .. కుల, మతాలకు పాకింది. పాకిస్థాన్ పై వాయుసేన చేసిన దాడులకు రాహుల్ రుజువు కావాలంటున్నారు .. మరి ముస్లిం కుమారుడు బ్రహ్మిన్ ఎలా అవుతారని కేంద్రమంత్రి అనంత్ హెగ్డే అనడంతో అగ్గి రాజేసింది. దీనికి ధీటుగా కాంగ్రెస్ ఎంపీ గోవింద్ సింగ్ స్పందించారు. మరి మీదే కులం, మీ తల్లిదండ్రుల డీఎన్ఏ నుంచి మీ కులం నిర్ధారించారా అని ప్రశ్నించారు.

ఆధారాలు వర్సెస్ కుల మతాలు

ఆధారాలు వర్సెస్ కుల మతాలు

ఓ వ్యక్తిని కుల, మతాలతో దూషించకూడదని సూచించారు గోవింద్ సింగ్. 'మీ తల్లిదండ్రులు డీఎన్ఏ టెస్ట్ చేసి కులాన్ని నిర్ధారించారా, కులం గురించి ప్రస్తావిస్తూ ఒకరి సెంటిమెంట్ ను కించపరచడం మంచి పద్ధతి కాదు‘ అని గోవింద్ సింగ్ అన్నారు. బాలాకోట్ దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలని రాహుల్ గాంధీ అనడంతో .. ముస్లిం కుమారుడు బ్రహ్మిన్ ఎలా అవుతారని కేంద్రమంత్రి అనంత్ హెగ్గే ప్రశ్నించారు. మీరు బ్రాహ్మిన్ అని నిరూపించండి అని సవాల్ విసిరారు.

ప్రపంచం గుర్తించింది .. మరి మీరు ...

ప్రపంచం గుర్తించింది .. మరి మీరు ...

'బాలాకోట్ దాడులను యావత్ ప్రపంచం గుర్తించింది. సైనికుల ధైర్య, సాహసాలను కొనియాడింది. కానీ దేశంలోని కొందరు మాత్రం దాడులపై సందేహాలను లెవనెత్తి సైనికులను తక్కువ చేస్తున్నారు. వారికి దాడులకు సంబంధించి ఆధారాలు మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఓ ముస్లిం కుమారుడు బ్రహ్మిన్ ఎలా అవుతారు. ఇందుకు ఏమైనా రుజువు ఉందా ? ఓ ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి జన్మించిన వ్యక్తి బ్రాహ్మిన్ ఎలా అవుతారు‘ అని అనంత్ కుమార్ హెగ్డే మండిపడ్డారు.

గతంలో కూడా ..

గతంలో కూడా ..

రాహుల్ గాంధీది ఏ మతమో తెలియదని గత జనవరిలో వ్యాఖ్యానించారు అనంత్ హెగ్డే. రాహుల్ తల్లిదండ్రులకు సంబంధించి ఆరోపణలు చేశారు. ఇదివరకు కూడా రాహుల్ సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి రుజువు చూపించమని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో జరిగిన వైమానిక దాడులకు ఆధారాలు చూపమని కోరడంతో అనంత్ హెగ్డే ధీటుగా స్పందించారు. ఇలాంటి హైబ్రిడ్ జాతిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని .. ఇది కేవలం కాంగ్రెస్ ల్యాబ్ లో మాత్రమే ఉత్పత్తి అయ్యిందని విమర్శించారు. అదీ కూడా తండ్రి, తల్లి వేరు వేరు కులమతాలకు చెందినవారని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి ధీటుగా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ గోవింద్ సింగ్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+