బీజేపీలో చేరుతున్నారా? మళ్లీ వార్తల్లోకి శశి థరూర్!

Shashi Tharoor vs Congress: కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన సొంత పార్టీ నాయకత్వం నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మంగళవారం ఆయన ప్రధాని మోదీ ప్రసంగాన్ని పొగడటంతో ఈ వివాదం తలెత్తింది. ఇంతకు ముందు కూడా శశి థరూర్ ప్రధానిపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు దీనిని సుముఖంగా స్వీకరించే అవకాశం లేదు.

ప్రధాని ప్రసంగంపై శశి థరూర్ పోస్ట్
ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న శశి థరూర్ ప్రధాని మోదీ ప్రసంగం గురించి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక అసహనాన్ని గురించి మాట్లాడారని, వలసవాద అనంతర ఆలోచనా విధానాన్ని బలంగా ప్రోత్సహించారని థరూర్ తెలిపారు. ఇండియా కేవలం ఎమర్జింగ్ మార్కెట్ మాత్రమే కాదు.. ప్రపంచానికి ఎమర్జింగ్ మోడల్‌గా మారుతోందని మోదీ పేర్కొన్నారని.. కరోనా మహమ్మారి వంటి ప్రపంచ సంక్షోభాల నుంచి బయటపడటం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడంలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రపంచం గుర్తించిందని ప్రధాని చెప్పారని శశి థరూర్ పేర్కొన్నారు. మోదీ ఎప్పుడూ ఎన్నికల మోడ్‌లోనే ఉంటారని తనపై ఆరోపణలు ఉన్నాయని.. అయితే నిజంగా ప్రజల సమస్యలను పరిష్కరించే ఎమోషనల్ మోడ్‌లో ఉన్నట్లు ప్రధాని చెప్పినట్లు శశి థరూర్ వివరించారు.

Is Shashi Tharoor Moving Toward BJP Modi Praise Sparks New Congress Tensions

మెకాలే వారసత్వంపై ప్రధాని మోదీ
ప్రధాని తన ప్రసంగంలో వలసవాదం, విద్యపై మెకాలే ప్రభావం గురించి ఎక్కువగా ప్రస్తావించారు. "భారతీయ విద్యపై మెకాలే సృష్టించిన 200 ఏళ్ల 'బానిస మనస్తత్వం' వారసత్వాన్ని తిరగరాయడం" ప్రసంగంలో కీలక అంశమని శశి థరూర్ తెలిపారు. భారతదేశ వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థల పట్ల గర్వాన్ని పునరుద్ధరించడానికి 10 ఏళ్ల జాతీయ లక్ష్యాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. "మొత్తం మీద, ఈ ప్రసంగం ఆర్థిక దృక్పథాన్ని, సాంస్కృతిక కార్యాచరణకు పిలుపునిచ్చింది. ఈ ప్రసంగాన్ని ప్రేక్షకుడిగా విన్నందుకు సంతోషంగా ఉంది," అని శశ థరూర్ ముగించారు.

కాంగ్రెస్‌తో పెరిగిన దూరం
శశి థరూర్ చేసిన ఈ ప్రశంసలు కాంగ్రెస్ పార్టీలో మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చు. గత కొన్ని నెలలుగా శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకు ముందు కూడా ప్రధాని మోదీని 'ప్రధాన ఆస్తి' అని అభివర్ణించడం, టెర్రర్ అటాక్ సంక్షోభాన్ని ఆయన నిర్వహించిన తీరును పొగడటం వంటి వ్యాఖ్యలతో శశి థరూర్ కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత స్నేహపూర్వక దేశాలకు వెళ్లిన ప్రభుత్వ ప్రతినిధి బృందంలో శశి థరూర్ ప్రతిపక్ష నేతగా ఎంపికైనప్పటి నుంచి ఆయన బీజేపీలోకి మారనున్నారనే గుసగుసలు పెరిగాయి. అయితే, "తాను బీజేపీలో చేరడం లేదని, ఇది జాతీయ ఐక్యతకు సంబంధించిన అంశం" అని థరూర్ జూన్‌లో స్పష్టం చేశారు.

శశి థరూర్ గతంలో 'జీ-23' నాయకుల బృందంలో భాగమై గాంధీ కుటుంబ నాయకత్వ శైలిపై అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం వంటి అంశాలు కూడా కాంగ్రెస్‌లో ఆయన స్థానాన్ని సందిగ్ధంలో పడేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+