వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఫొటోలో ఉంది నిజంగా శశికళేనా? నెట్ లో వైరల్ గా మారిన ఫొటో!

ఇంటర్నెట్ లో తాజాగా జయలలితకు సంబంధించిన ఫొటో ఏకటి హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో జయలలిత వెనుక చేతిలో పెట్టెతో ఉన్న మహిళ శశికళే అంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడంతా ఒకటే చర్చ. నిన్నమొన్నటి వరకు శశికళే సీఎం అని భావించిన వారంతా సుప్రీంకోర్టు ప్రకటనతో శశికళ సీఎం అవుతుందో, లేదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలు శశికళకు ఏ అర్హత ఉందని సీఎం అవుతుందనే నిరసన గళం కూడా మరోవైపు వినిపిస్తోంది. ప్రజల్లో ఏ మాత్రం ఆదరణ లేని, పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు తాము ఓటేయలేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇంటర్నెట్ లో తాజాగా జయలలితకు సంబంధించిన ఫొటో ఏకటి హల్ చల్ చేస్తోంది. జయలలిత సినిమాల్లో నటించే రోజుల్లో ఆమె ముందు నడుచుకుంటూ వస్తుండగా తీసిన ఫొటో అది. ఆ ఫొటోలో జయలలిత వెనుక ఓ మహిళ కూడా చేతిలో ఒక పెట్టె పట్టుకుని వస్తోంది.

అయితే ఆ మహిళ శశికళే అంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. జయలలిత వెనుక పనిమనిషిలా నిలుచుని ఉన్న శశికళ తమిళనాడుకు సీఎం అవడాన్ని ఏమాత్రం సహించబోమంటూ నెటిజన్లు కొందరు ఈ ఫొటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఆ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో జయలలిత వెనుక కనిపిస్తున్న వ్యక్తి నిజంగా శశికళేనా? అంటూ వర్మ సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె తమిళనాడుకు ముఖ్యమంత్రి కాబోతున్నారా? అంటూ ప్రశ్నించారు. మరి సదరు ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో ఎలా తెలుస్తుంది? తెలిసిన జయలలిత ఏమో లేరాయె!

English summary
One photo of Jayalalitha went viral on social media now. In that picture a woman carrying a box in her had behind jayalalitha is Sesikala? the same question is asked by Director Ram Gopal Varma in her Twitter account also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X