ఆవకాయ ఫ్లేవర్స్‌తో కండోమ్స్: మార్కెట్లోకి మ్యాన్ ఫోర్స్ కొత్త ప్రయోగం..
మ్యాన్ ఫోర్స్ అనే కంపెనీ ఈ ఉత్పత్తులకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.
న్యూఢిల్లీ: మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం ఆయా కంపెనీలు జిమ్మిక్కులను ప్రదర్శిస్తుంటాయి. ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే సెలబ్రిటీలను పెట్టి వాటికి ప్రచారం కల్పించుకోవడం ఒకటైతే.. సెంటిమెంటును లేదా అటాచ్‌మెంట్ క్యాష్ చేసుకోవడం మరొకటి.
అలా ఓ కండోమ్ ఉత్పత్తుల కంపెనీ దృష్టి ఇప్పుడు ఆవకాయ మీద పడింది. ఆవకాయ ఎంత స్పైసీగా ఉంటుందో.. దీని వాడకం వల్ల అంతే స్పైస్ పొందుతారన్న తరహాలో ఆచారీ ఫ్లేవర్ పేరుతో కండోమ్ లను తయారుచేస్తోంది. మ్యాన్ ఫోర్స్ అనే కంపెనీ ఈ ఉత్పత్తులకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది.

దీనిపై నెటిజెన్స్ రకరకాల సెటైర్స్ వేస్తున్నారు. త్వరలోనే మ్యాన్ ఫోర్స్ కంపెనీవాళ్లు పుదీనా ఫ్లేవర్ తోను కండోమ్స్ తీసుకురావాలని ఒకరు, బీర్ ఫ్లేవర్ కావాలని ఇంకొకరు, పాన్, రస్నా ఫ్లేవర్స్ కావాలని మరికొందరు.. ఇలా సెటైర్స్ మీద సెటైర్స్ వేస్తున్నారు.












Click it and Unblock the Notifications