మోడీని, పర్రికర్‌ను చంపుతాం: ఐసిస్ లేఖ

పానాజీ: ప్రధాని నరేంద్ర మోడీని, రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్‌ను హెచ్చరిస్తూ ఐస్ఐఎస్ సంతకం ఉందని చెబుతున్న ఓ అనామక లేఖ వెలుగు చూసింది. ఆ లేఖ ప్రతులను గోవా పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు.

ఆ కేసును ఉగ్రవాద వ్యతిరేక బలగానికి (ఎటిఎస్‌కు) అప్పగించారు. అది పోస్ట్ కార్డు లేఖ. ఆ లేఖ గతవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చింది. దాంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది.

‘ISIS letter’ threatens to kill Narendra Modi, Manohar Parrikar

రాష్ట్రానికి చెందిన అన్ని పోలీసు సంస్థలు ఆ లేఖపై దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని త్వరలోనే తెలుసుకుంటామని అన్నారు.

పోస్ట్ కార్డు కింద ఐఎస్ఐఎస్ అని రాసి ఉందని మంగళవారం ఆ అధికారి చెప్పారు. దేశంలో గోవధను నిషేధించడంపై ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+