ఇస్లామిక్ స్టేట్ కేరళలో గాలం: ఉద్యోగం, డబ్బు

తిరువనంతపురం: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు వారి అరాచకాలకు ఆకర్షితులు అవుతున్న వారినే కాదు ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నగదు, ఉద్యోగం పేరుతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు యువతకు వల వేస్తున్నదని కేరళ పోలీసులు చెప్పారు. రియాబ్ ఉల్ రెహమాన్ (ఉగ్రవాది) విరుద్దంగా నమోదు చేసిన కేసు చార్జ్ షీట్ లో ఈ వివరాలు పోందుపరిచారు. కేరళ పోలీసులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు లాగుతున్నారు.

కేరళ పోలీసులు ఇప్పటికే అనేక మందిని విచారణ చేసి వివరాలు సేకరించింది. ఇస్లామిక్ స్టేట్ కు అనుకూలంగా పని చేస్తున్నారని వెలుగు చూడటంతో యుఏఇ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరిని కేరళ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ISIS recruitment are not only based on ideology.

ఐఎస్ఐఎస్ కేళరలోని మల్లపురం లోని హిందూ మతానికి చెందిన ఇద్దరు యువకులతో సహ అనేక మందిని సంప్రదించిందని వెలుగు చూసింది. మంచి ఉద్యోగం ఇస్తామని, మీరు ఊహించని జీతం ఇస్తామని వారిని నమ్మించారు.

మీరు సిరియా రావడానికి అన్నివిధాల సహకరించి నగదు సహాయం చేస్తామని వారు హామి ఇచ్చారని కేరళ పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై రియాబ్ ఉల్ రెహమాన్ అనే వ్యక్తి అనేక మంది యుకులతో సంప్రదించారని కేరళ పోలీసులు చెప్పారు.

ఐఎస్ఐఎస్ లో చేరడానికి ఐదు మంది యువకులు సిద్దం కావడానికి రియాబ్ ఉల్ రెహమాన్ సహకరించాడని వెలుగు చూసింది. ఆ యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా ఎంత మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వలలో పడ్డారు అని ఆరా తీస్తున్నామని కేరళ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+