విదేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్: తలతీస్తామని ఐసిస్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్‌కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ నుండి హత్యా బెదిరింపు ఉత్తరాలు వచ్చాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి నకులు ధావన్ చెప్పారు. తూర్పు దేశాల పర్యటనలో ఉన్న రవిశంకర్ శుక్రవారం మలేషియా చేరుకున్నారు.
కొద్ది రోజుల క్రితం కంబోడియా పర్యటనలో ఉండగా రవిశంకర్ బస చేసిన హోటల్‌కు మూడు ఉత్తరాలు వచ్చాయని ఆ ప్రతినిధి చెప్పారు. భారతీయ గురుజీ రవిశంకర్ మలేషియాలో అడుగు పెడితే ఆయనకు శిరచ్చేదం తప్పదని ఐసిస్ తన ఉత్తరంలో హెచ్చరించిందన్నారు.
ఎయిర్ ఇండియా విమానం హైజాక్ ప్రచారం అవాస్తవం

ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేయడానికి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి. దీనిపై విమానయాన అధికారులు శనివారం స్పందించారు. ఈ నెల 17వ తేదీ నుండి ఢిల్లీకి వస్తున్న ఏఐ112 విమానంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదన్నారు.
విమానాన్ని హైజాక్ చేయాలనే ఉద్దేశ్యంతో పైలట్‌ను సంప్రదించడానికి కొందరు ప్రయత్నించారనే ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఓ ప్రయాణీకుడు అనారోగ్యానికి గురైనట్లు నటించాడని పాకిస్తాన్‌కు చెందిన వారు అతనికి వైద్యం అందించాలని కోరారని వార్తలు వచ్చాయి. అయితే, అందులో పాక్ జాతీయులెవరు లేరని తెలిపారు.












Click it and Unblock the Notifications