మంకీపాక్స్ వైరస్ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
మంకీ పాక్స్ వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్టయ్యింది. వాస్తవానికి దేశంలో కేసులు నమోదు కాలే.. అయినప్పటికీ ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన మార్గదర్శకాలను జారీచేసింది. ఇతర దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. కేసులను గుర్తించడం, ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం, ఇతరులకు సోకకుండా చూడటం వంటి అంశాల్లో రాష్ట్రాలకు సూచనలు చేసింది.
కేసులను త్వరగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడవచ్చని కేంద్రం తెలిపింది. వ్యాధి సోకిన వారిని కనీసం 21 రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచడంతోపాటు, రోగిని చివరగా కలిసిన వ్యక్తిని గుర్తించడంతోపాటు, రోగి వాడిన వస్తువులను దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచాలి. ముఖ్యంగా త్వరగా వ్యాధి సోకే అవకాశం ఉన్నవాళ్లను పేషెంట్లకు దూరంగా ఉంచాలి. రోగి తాకిన వస్తువులకు, రోగి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. కరోనాలాగే రోగిని కలిస్తే జాగ్రత్తగా ఉండాలి.

చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్, గ్లోవ్స్ ధరించడం, శానిటైజర్ వాడటం చేయాలి. గర్భిణులను, ఇతర వ్యాధులు ఉన్నవాళ్లను రోగికి దూరంగా ఉంచాలి. పీసీఆర్ టెస్టుల ద్వారా వ్యాధిని గుర్తించాలి. వ్యాధి నమూనా పరీక్షలను పుణేలోని ఐసీఎమ్ఆర్ ల్యాబ్‌కు పంపాలి. వ్యాధి ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులను కూడా జాగ్రత్తగా గమనించాలి.
జ్వరం, తలనొప్పి, లింఫ్ నోడ్స్ వాపు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే ముందుగానే జాగ్రత్త వహించాలి. మంకీపాక్స్ సోకితే ఎలాంటి చికిత్స అందించాలో కూడా కేంద్రం పేర్కొంది. దీంతోపాటు విదేశాలకు వెళ్లే వాళ్లకు కూడా పలు సూచనలు చేసింది. అక్కడ రోగులకు, రోగ లక్షణాలు ఉన్నవాళ్లకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే ఎలుకలు, ఉడుతలు, కోతులు వంటి జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications