Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: ఇస్రో ఛైర్మన్ శివన్ సింప్లిసిటీ: ఎకానమీ క్లాసులో: సెల్ఫీల కోసం ఎగబడ్డ ఎయిర్ హోస్టెస్

Recommended Video

    Excited Indigo Air Hostess Clicks Selfie With Sivan || ఇస్రో ఛైర్మన్ సింప్లిసిటీ కి నెటిజన్లు ఫిదా

    బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ తరువాత ఆ సంస్థ ఛైర్మన్ కే శివన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కిందటి నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ దారి తప్పిన తరువాత ఇస్రో గ్రౌండ్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఉద్విగ్నభరిత పరిణామాలు ఆయనను దేశ ప్రజలకు సుపరిచితులను చేశాయి. ఇస్రో, చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్.. ఈ మూడింటి తరువాత తప్పనిసరిగా గుర్తు చేసుకునే పేరు కే శివన్. అంతలా ఆయనను దేశ ప్రజలు ఆదరిస్తున్నారు.

    వందల కోట్ల ప్రాజెక్టును చేపట్టే ఇస్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్న శివన్.. ఓ సాధారణ వ్యక్తిలా కనిపిస్తుంటారు. న్యూఢిల్లీలో ఓ కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన స్వస్థలానికి బయలుదేరారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో శివన్ ఎకానమి క్లాసులో ప్రయాణించారు. విమానంలోకి ఎక్కిన వెంటనే ఎయిర్ హోస్టెస్ లు శివన్ ను గుర్తు పట్టారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. వారిని నిరాశకు గురి చేయకుండా ఓపిగ్గా ఎయిర్ హోస్టెస్ లతో ఫొటోలు దిగారు శివన్.

     ISRO Chairman K Sivan travelling in an economy class in IndiGo 6E flight

    నిజానికి ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాసులు ఉండవు. ఒక్క ఎకానమి క్లాసులు ఉన్న విమానాలను మాత్రమే ఆ సంస్థ నడిపిస్తోంది. అయినప్పటికీ- ఆ సంస్థకు చెందిన విమానాన్నే శివన్ ఎంచుకున్నారు. విమానంలో ఎక్కిన తరువాత పలువురు ప్రయాణికులు ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. చప్పట్లు కొడుతూ స్వాగతించారు. తోటి ప్రయాణికులను చిరునవ్వుతో పలకరిస్తూ తన సీటు వైపు కదిలారాయ. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివన్ సింప్లిసిటీ పట్ల ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దేశానికి గర్వకారణమైన అంతరిక్ష శాస్త్రవేత్తగా ఆయనను అభివర్ణిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+