కార్టోశాట్-3 ప్రయోగం వాయిదా: 13 నానో ఉపగ్రహాలను మోసుకెళ్లడంలో జాప్యం..!
బెంగళూరు: కార్టోశాట్-3 ప్రయోగం వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అంతరిక్షంలోకి ప్రయోగించనున్న ఈ ప్రాజెక్టును సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25కు బదులుగా 27వ తేదీన ప్రయోగించినున్నట్లు తెలిపారు. 27వ తేదీన ఉదయం 9:28 నిమిషాలకు కార్టోశాట్-3ని ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారుం.. కార్టోశాట్-3ని 25వ తేదీన ఉదయం 9:28 నిమిషాలు ప్రయోగించాల్సి ఉంది. ఈ ప్రయోగం సందర్భంగా దేశీయంగా రూపొందించిన ఓ ఉప్రగహంతో పాటు అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను ఇస్రో అంతరిక్షంలో ప్రయోగించాల్సి ఉంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి కార్టోశాట్-3ని పంపించాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల దీన్ని 27వ తేదీన ఉదయం 9:28 నిమిషాలకు ప్రయోగించనున్నట్లు కే శివన్ వెల్లడించారు.

కార్టోశాట్ -3 ఉపగ్రహం థర్డ్ జనరేషన్ కు చెందిన అడ్వాన్స్‌డ్ శాటిలైట్. హై రిజల్యూషన్ ఇమేజింగ్ దీని సొంతం. అంతకుముందు ప్రయోగించిన కార్టోశాట్లలతో పోల్చుకుంటే అత్యాధునిక పరికరాలను ఇందులో అమర్చారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు వారి శిబిరాలను సైతం పసిగట్టడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని అంటున్నారు. మిలటరీ నిఘా కార్యక్రమాలకు ఈ ఉపగ్రహం ఎక్కువగా దోహదపడుతుంది.
కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇక ఇస్రో చెబుతున్న ప్రకారం అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు. స్పేస్ డిపార్ట్‌మెంట్ కింద కొత్తగా ఏర్పడిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ నానో శాటిలైట్లను రూపొందించింది. దీనితోపాటు అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను అంతరిక్షంలోనికి మోసుకెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications