Chandrayaan 3: చంద్రుడి ఉపరితలం పై నుంచి పైకి లేచిన ల్యాండర్.. ఎక్కడికి వెళ్లిందంటే..!
చంద్రయాన్-3కి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించి ఇస్రో ఎక్స్(ట్వీట్) చేసింది. చంద్రుడి దక్షిణ ధృవం ఉన్న ప్రగ్యాన్ రోవర్ నిద్రలోకి వెళ్లింది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ శాస్త్రవేతలు చెప్పింది చేసింది. ఇస్రో శాస్త్రవేతలు ల్యాండర్ ను గాల్లోకి లేపే ప్రయత్నం చేశారు. ఇస్రో ప్రయత్నం విజయవంతం అయింది. విక్రమ్ ల్యాండర్ లో ఉన్న ఇంధనాన్ని మండించటం ద్వారా.. ల్యాండర్ ను చంద్రుడి ఉపరితలం నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు గాల్లోకి ఎగిరేలా చేశారు.
గాల్లోకి లేచిన విక్రమ్ ల్యాండర్ 40 సెంటీమీటర్లు ఎగరడంతో పాటు 30 నుంచి 40 సెంటీ మీటర్ల దూరం ప్రయాణం కూడా చేసింది. మరో ప్రదేశంలో ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయింది. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా లేచి మరో చోట ల్యాండ్ కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చాలా పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. చాలా దేశాలు చంద్రుడిపై దిగటం వరకే ఇప్పటి వరకు చేశారు కానీ ఇప్పుడు చంద్రుడి ఉపరితలం నుంచి ల్యాండర్ మళ్లీ గాల్లోకి లేవటం కీలక విజయంగా పరిగణిస్తున్నారు.

ఇది భవిష్యత్ లో మానవ ప్రయోగాలకు ఇది ఎంతోగా ఉపయోగపడుతుందని శాస్త్రవేతలు భావిస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ ను 15 రోజుల తర్వాత విజయవంతంగా మళ్లీ గాల్లోకి లేపి.. అక్కడి నుంచి మరో ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేయటం అనే టెక్నాలజీ, వ్యూహమని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలకు ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశభావం వ్యక్తం చేశారు. ల్యాండర్ లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో స్పష్టం చేసింది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) September 4, 2023
🇮🇳Vikram soft-landed on 🌖, again!
Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.
On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI
విక్రమ్ ల్యాండర్ ఆగస్టు ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. చంద్రుడిపై చక్కర్లు కొట్టింది. చంద్రుడికి సంబంధించిన ఫొటోలను ఇస్రోకు పంపింది. చంద్రుడి దక్షిణ ధృవంపై సూర్యుడు అస్తమించడంతో ప్రగ్యాన్ రోవర్ నిద్రలోకి వెళ్లినట్లు ఇస్రో తెలిపింది. మరో 14 రోజుల తర్వాత అక్కడ సూర్యుడు ఉదయించనున్నాడు. అప్పటి వరకు రోవర్ సరిగా ఉంటే మరోసారి ప్రగ్యాన్ చంద్రుడిపై చక్కర్లు కొట్టనుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications