మేఘ ట్రోపికస్-1 ఉపగ్రహాన్ని మహా సముద్రంలో విజయవంతంగా కూల్చేసిన ఇస్రో
ఓ ఉపగ్రహాన్ని భారత్ పూర్తి నియంత్రిత విధానంలో సురక్షితంగా మహా సముద్రంపై ఇస్రో కూల్చి వేసింది.
న్యూఢిల్లీ: గగనతలన చరిత్రలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అరుదైన ఘనతను సాధించింది. ఓ ఉపగ్రహాన్ని భారత్ పూర్తి నియంత్రిత విధానంలో సురక్షితంగా మహా సముద్రంపై కూల్చి వేసింది. మేఘ-ట్రోఫికస్-1(ఎంటీఐ) ఉపగ్రహాన్ని పసిఫిక్ మహాసముద్రంపై విజయవంతంగా కూల్చివేసినట్లు ఇస్రో(ISRO) మంగళవారం రాత్రి వెల్లడించింది.
ఈ ఉపగ్రహం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని.. ఆ తర్వాత పసిఫిక్ మహా సముద్రంలో విచ్ఛిన్నమవుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రముఖులతోపాటు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

'డికమిషన్ చేసిన మేఘా-ట్రోపిక్స్-1 (MT-1) కోసం నియంత్రిత రీ-ఎంట్రీ ప్రయోగం మార్చి 7, 2023న విజయవంతంగా నిర్వహించబడింది' అని ఇస్రో ట్వీట్ చేసింది.
ఉష్ణమండల వాతావరణం, వాతావరణ అధ్యయనాల కోసం ఇస్రో, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ CNES అభివృద్ధి చేసిన ఉమ్మడి మిషన్‌గా మేఘా-ట్రోపిక్స్-1 అక్టోబర్ 12, 2011న ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి ప్రవేశపెట్టారు. మిషన్ ప్రారంభంలో మూడు సంవత్సరాలు పనిచేయాలని ప్రణాళిక చేశారు. అయితే ఇది ఒక దశాబ్దం పాటు వాతావరణం గురించి కీలక డేటాను అందించడం కొనసాగించినందున ఇది పొడిగించారు.
The controlled re-entry experiment for the decommissioned Megha-Tropiques-1 (MT-1) was carried out successfully on March 7, 2023.
— ISRO (@isro) March 7, 2023
The satellite has re-entered the Earth’s atmosphere and would have disintegrated over the Pacific Ocean. pic.twitter.com/UIAcMjXfAH
మిషన్ జీవితం ముగిసిన తరువాత, ఐక్యరాజ్యసమితి ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (UNIADC)కి కట్టుబడి ఉండటంలో భాగంగా ఇస్రో ఉపగ్రహాన్ని క్రాష్ చేసింది. యూఎన్ మార్గదర్శకాలు దాని జీవితాంతం ఉపగ్రహాన్ని నిర్వీర్యం చేయాలని పేర్కొంటున్నాయి. కాగా, మేఘా-ట్రోపిక్స్-1లో ఇప్పటికీ దాదాపు 125 కిలోల ఆన్‌బోర్డ్ ఇంధనం ఉందని, ఇది పూర్తిగా నియంత్రించబడిన వాతావరణ రీ-ఎంట్రీని సాధించడానికి సరిపోతుందని అంచనా వేసినట్లు ఇస్రో తెలిపింది.
కాగా, ఉపగ్రహాలను కూల్చివేసే ప్రక్రియలో చైనా సహా పలు దేశాలు ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న సమయంలో.. భారత్ మాత్రం విజయవంతంగా ఆ పనిని పూర్తి చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications