పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని ఓ బిజినెస్ గ్రూప్ పై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. విస్త్రతంగా సోదాలు చేయగా భారీసంఖ్యలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. సుమారురూ.56 కోట్ల నగదు లభ్యమవడంతో దీన్ని లెక్కించడానికి 13 గంటల సమయం పట్టింది. ఈ నగదుతోపాటు వందల కోట్లరూపాయల విలువైన బినామీ ఆస్తులను కూడా అధికారులు గుర్తించారు. జల్నాలోని స్టీల్, దుస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ సంస్థ కొన్నాళ్లుగా పన్ను ఎగవేతకు పాల్పడుతోందని ఐటీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈనెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 260 మంది ఐటీ సిబ్బంది 5 బృందాలుగా ఏరపడి జిల్లవ్యాప్తంగా సోదాలు చేపట్టారు. ఈ సంస్థకు చెందిన యజమాని ఇళ్లు, కార్యాలయల్లో తనిఖీలు జరిగాయి.

Income Tax officials raided a business group in Maharashtras Jalna district.

రూ.56 కోట్ల నగదుతోపాటు రూ.14 కోట్ల బంగారు, వజ్రాభవరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆస్తులకు సంబంధించిన డిజిటల్ డేటా, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తాన్ని కార్యాలయానికి తెచ్చిన తర్వాత 13 గంటలకు పైగా అధికారులు ఎంతో శ్రమించి లెక్కించినట్లు తెలుస్తోంది. రూ. 390 కోట్ల మేర లెక్కల్లోకి రాని బినామీ ఆస్తులను గుర్తించారు. ప్రస్తుతం నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే బెంగాల్ లో ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసాల్లో గుట్టల కొద్దీ నగదును ఈడీ గుర్తించింది. ఇటీవలే యూపీలోని కాన్పూర్ కు చెందిన ఓ సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లోను నోట్లు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+