కేజీఎఫ్ బాబుకు సినిమా చూపించిన ఐటీ శాఖ, రూ, 1, 621 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ?

బెంగళూరు/కేజీఎఫ్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలువురు రాజకీయ నాయకులు వారి ఆస్తులు, అప్పుల వివరాలను ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పిస్తున్నారు. ఇదే సమయంలో భార్యతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించిన కేజీఎఫ్ బాబు ఇంటిలో, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చెయ్యడం కలకలంరేపింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేజీఎఫ్ బాబు ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కేజీఎఫ్ బాబు తన ఆస్తి రూ. 1, 754 కోట్ల ఆస్తి ఉందని ప్రకటించుకున్నారు. తరువాత కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వ్యాపారాలు చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులోని చిక్కపేట నియోజక వర్గం టిక్కెట్ తనకు కావాలని కేజీఎఫ్ బాబు కాంగ్రెస్ కు మనవి చేశారు.

 kgfbabu

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ప్రకటించక ముందే గత బుధవారం కేజీఎఫ్ బాబు ఆయన భార్య షాజియా తరనమ్ తో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. భార్యతో నామినేషన్ వేయించడమే కాకుండా మరో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మేయర్ గంగాబికే తో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించిన కేజీఎఫ్ బాబు రాజకీయం చెయ్యడం మొదలుపెట్టారు.

చిక్కపేట్ మాజీ ఎమ్మెల్యే ఆర్ వీ. దేవరాజ్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. కేజీఎఫ్ బాబు నామినేషన్ వేసే సమయంలో ఆమె తన దగ్గర రూ. 35 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 40. 59 లక్షల విలువైన చరాస్తి మత్రమే ఉందని, తన భర్త పేరుతో రూ. 1,621. 71 కోట్ల విలువైన ఆస్తి ఉందని ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు.

కేజీఎఫ్ బాబు నామినేషన్ వేసిన వారం రోజుల తరువాత ఐటీ శాఖ అధికారులు వారికి షాక్ ఇచ్చారు. బుధవారం బెంగళూరులోని హైగ్రౌండ్స్ సమీపంలోని కేజీఎఫ్ బాబు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కేజీఎఫ్ బాబు మీద చాలా రోజు నుంచి ఐటీ శాఖ అధికారుల కన్నుపడింది. 10 నెలల క్రితం ఈడీ అధికారులు బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరులో కేజీఎఫ్ బాబుకు చెందిన ఆస్తులు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+