రిసార్టులో టెక్కీపై రేప్: బైక్‌పై ఎత్తుకెళ్లి అమ్మాయిని

తీవ్రంగా గాయపడిన బాధితురాలు మరుసటి రోజు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఉన్న గది తలుపు బాగా లేదని పోలీసులు గుర్తించారు. కాగా, తాను దశాబ్దాల క్రితం బెంగాల్ నుండి వచ్చి బెంగళూరులో సెటిల్ అయినట్లు యువతి పోలీసులకు తెలిపారు. అత్యాచారం జరిగిన రిసార్టును పోలీసులు చెక్ చేశారు. ఇది కేరళ రాజధాని తిరువనంతపురంకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది.
కాగా, విశాఖ జిల్లాలోని గాజువాకలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై రాత్రాంతా ఆత్యాచారం జరిపి, ఆదివారం ఉదయం విడిచిపెట్టాడు. శనివారం సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధినిని ఇంటి వద్ద దింపుతానని అదే కాలనీకి చెందిన యువకుడు బైక్‌పై ఎక్కించుకుని ఓ ఇంటికి తీసుకువెళ్ళి నిర్బంధించి, రాత్రాంతా అత్యాచారం జరిపి ఈరోజు ఉదయం ఆమె ఇంట్లో విడిచిపెట్టాడు.
విషయం తెలుసుకున్న బాలిక తల్తిదండ్రులు గాజువాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని విద్యార్తిని తల్లిదండ్రులు పిఎస్ మందు ఆందోళన నిర్వహించారు.












Click it and Unblock the Notifications