చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్లికట్టు పోరాటం: రూ. కోటి ఇస్తా, డైరెక్టర్ లారెన్స్: విదేశీ కుట్ర

జల్లికట్టు కోసం మెరీనా బీచ్ లో పోరాటంలో పాల్గొంటున్న వారి ఆకలి దప్పులు తీర్చడానికి కోటి రూపాయలు ఖర్చు అయినా సరే తాను ఇస్తానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు నిర్వహించాలని పోరాటం చేస్తున్న విద్యార్థులకు బాసటగా నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ నిలిచారు. విద్యార్థులు పోరాటం చేస్తున్న మెరీనా బీచ్ కు చేరుకున్న లారెన్స్ వారితో కలిసి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని ధర్నాలో నినాదాలు చేశారు.

చెన్నైలో ఉద్రిక్త పరిస్థితి: స్టాలిన్ మద్దతు, తలపట్టున్న పన్నీర్ !

జల్లికట్టు కోసం పోరాటంలో పాల్గొంటున్న వారి ఆకలి దప్పులు తీర్చడానికి కోటి రూపాయలు ఖర్చు అయినా సరే తాను ఇస్తానని లారెన్స్ ప్రకటించారు. జల్లికట్టు కోసం తమిళలందురూ ఒక్కటయ్యారు. ఇది మనకు సగం బలం, విజయం అని లారెన్స్ చెప్పారు.

నా మొబైల్ ఫోన్ కు నిన్న ఎవరో ఒక మెసేజ్ పంపించారు. జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులకు అన్నం, నీళ్లు అందడం లేదని, వారు పస్తులతో ఉన్నారని పంపించారని లారన్స్ చెప్పారు.

IT employees did rally for supporting Jallikattu

పోరాటం చేస్తున్న విద్యార్థులు ఆకలితో ఉండటం మంచిది కాదు, ఈ పోరాటంలో పాల్గొనే వారికి అన్నం, నీళ్లు అందించడానికి కోటి రుపాయలు ఖర్చు అయినా సరే తానే ఇస్తానని విద్యార్థులకు హామి ఇచ్చారు.

తమిళనాడు ఇన్ చార్జ్ గా మెగస్టార్ చిరంజీవి ?

తమిళనాడు సంసృతికి అద్దం పట్టే జల్లికట్టు సాహస క్రీడను విదేశీ శక్తులు అడ్డుకుంటున్నాయని లారెన్స్ ఆరోపించారు. తమిళనాడులో సంప్రధాయంగా నిర్వహించే జల్లికట్టుకు అనుమతిఇవ్వాలని ఇదే సమయంలో లారెన్స్ కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు.

తమిళనాడులోని ఐటీ ఉద్యోగులు, సిబ్బంది వెయ్యి మందికి పైగా పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి చెన్నైలోని మెరీనా బీచ్ లో విద్యార్థులు చేస్తున్న పోరాటంలో పాల్గోని జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎండను సైతం లెక్క చెయ్యకుండా గంటలు గంటలు ధర్నాలో పాల్గొన్నారు.

English summary
Kovai IT employees did rally for supporting Jallikattu. over thousands employees partcipated in this rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X