రిపీట్: మరో బెంగళూర్ స్కూల్లో బాలికపై రేప్

It happens again: Six-year-old raped in Bengaluru school
హైదరాబాద్‌: కర్ణాటక రాజధాని బెంగళూర్‌ పాఠశాలల్లో అత్యాచారాల ఘటనలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. మూడేళ్ల బాలికపై అత్యాచార ఘటనను మరిచిపోక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. జలహళ్లి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరేళ్లపై బాలికపై లైంగిక దాడి జరిగింది. న్యూ తిప్పసంద్రలోని ఇందిరానగర్ కేంబ్రిడ్జీ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన 38 ఏళ్ల హింది టీచర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తిప్పసంద్రకు చెందిన జయశంకర్‌గా గుర్తించారు. సంఘటన మంగళవారంనాడు జరిగిందని పోలీసులు చెప్పారు. బాలిక తల్లి బుధవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

బాధిత బాలిక ఒకటో తరగతి చదువుతోంది. అనుమానితుడు తమిళనాడుకు చెందినవాడు. గత కొన్నేళ్లుగా అతను పాఠశాలలో పనిచేస్తున్నాడు. హిందీ టీచర్‌ తనను పురుషుల టాయిలెట్లోకి తీసుకుని వెళ్లి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక చెప్పింది. బాలిక గత కొన్ని నెలలుగా అతని వద్ద హిందీ ట్యూషన్‌కు వెళ్తోంది.

మంగళవారంనాడు ఇంటికి వచ్చిన బాలిక తల్లికి దిగాలు పడినట్లు కనిపించింది. రాత్రంతా బాలిక నిద్ర పోలేదు. తనకు కడుపు నొప్పి వస్తోందని బుధవారం ఉదయం చెప్పింది. సాయంత్రం ఆమెను తల్లి క్లినిక్‌కు తీసుకుని వెళ్లింది.

బాలికపై లైంగిక దాడి జరిగిందని డాక్టర్ పరీక్షల అనంతరం చెప్పారు. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీవన్ నగర్ బీమా పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంపై జయశంకర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు అదనపు పోలీసు కమిషనర్ ఆలోక్ కుమార్ చెప్పారు.

పాఠశాల భద్రతా సూత్రాలను పాటించడం లేదని, ఈ సెప్టెంబర్‌లో పాఠశాలపై కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. బాలికపై అత్యాచారం జరిగిందనే ఆరోపణ బయటకు రాగానే గురువారం రాత్రి దాదాపు వంద మంది పాఠశాల వద్ద ధర్నాకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+