Bengaluru: లవ్ స్టోరీ, యువతిని పువ్వుల్లో పెట్టి పాక్ ఆర్మీకి అప్పగించారు, అసలు మ్యాటర్ ఏందంటే ?

కట్టుదిట్టమైన భద్రతా ఉన్నాసరే పాకిస్తాన్ చెందిన యువతి చాకచక్యంగా ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని చాలాకాలంగా నివాసం ఉంటోంది. డమ్ ను దేశం నుంచి బహిష్కరించారు.

బెంగళూరు/పాకిస్తాన్: భారత్ దాయాది దేశం పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు వాళ్లు చేస్తున్న అరాచకాలు ఇంతా అంతకాదు అని మనకు తెలిసిందే. జీహాద్ ముసుగులో భారత్ సైనికులను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారు. ఇంత కట్టుదిట్టమైన భద్రతా ఉన్నాసరే పాకిస్తాన్ చెందిన యువతి చాకచక్యంగా ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని చాలాకాలంగా నివాసం ఉంటున్నదని వెలుగు చూడటం కలకలం రేపింది. అధికారుల విచారణలో ములాయం సింగ్, మేమడ్ లవ్ స్టోరీ కూడా బయటకు వచ్చింది. కోర్టు ఆదేశాలతో ఆమెను దేశం నుంచి బహిష్కరించారు. ఐటీ హబ్ లో ఇంతకాలం ఎంజాయ్ చేసిన పాక్ యువతిని బార్డర్ దాటించేశారు.

ఫోన్ కాల్స్ తో ?

ఫోన్ కాల్స్ తో ?

పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల మీద, వారి కదలికల మీద భారతదేశంలోని ఇంటెలిజెన్స్ అధికారులు నిత్యం నిఘా వేస్తున్ననారు. భారత్ లో నివాసం ఉంటున్న వారికి పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆ దేశంలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. అలాగే భారత్ లో ఉన్న వాళ్లు ఎవరైనా పాక్ ఉగ్రవాదులు సంప్రధిస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. భారత్ కు చెందిన వాళ్లు పాకిస్తాన్ లో ఉన్న వారికి ఫోన్లు చేస్తున్నారా ? అంటూ ఇంటెలిజెన్స్ అధికారులు, ఐబీ వర్గాలు ప్రతినత్యం నిఘా వేస్తూనే ఉంది.

ఇశ్రా మేడమ్ అక్కడే ఉంది చూడండి

ఇశ్రా మేడమ్ అక్కడే ఉంది చూడండి

ఐటీ హబ్ బెంగళూరులోని బెళ్లందూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్జాపుర మెయిన్ రోడ్డులోని జున్నసంద్ర ప్రాంతంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని (19) అనే యువతిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఇశ్రా జీవని పాకిస్తాన్ లోని ఆమె తల్లితో ఫోన్ లో మాట్లాడటానికి ప్రయత్నించింది. తరువాత ఇశ్రా పాకిస్తాన్ లోని ఆమె తల్లితో ఫోన్ లో మాట్లాడిందని తెలిసింది. విషయం తెలుసుకున్న కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పాకిస్తాన్ యువతి ఇశ్రా గురంచి బెంగళూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎవ్వరికి డౌట్ రాకుండా ?

ఎవ్వరికి డౌట్ రాకుండా ?

బెంగళూరు పోలీసులు సర్దాపుర రోడ్డులోని జున్నసంద్రలో నివాసం ఉంటున్న పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని మీద నిఘావేశారు. ఎవ్వరికి డౌట్ రాకుండా వేకువ జామున బెంగళూరు పోలీసులు పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని, ఆమెతో పాటు నివాసం ఉంటున్న ములాయం సింగ్ అనే యువకుడు నివాసం ఉంటున్న ఇంటిని చుట్టుముట్టారు. అదే రోజు ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం మా మధ్య పాకిస్తాన్ యువతి నివాసం ఉందని తెలుసుకున్న జున్నసంద్ర ప్రాంతంలో ఉంటున్న ప్రజలు హడలిపోయారు.

ఇద్దరు ఎలా టచ్ లోకి వచ్చారంటే ?

ఇద్దరు ఎలా టచ్ లోకి వచ్చారంటే ?

ఉత్తరప్రదేశ్ కు చెందిన ములాయం సింగ్ అనే యువకుడికి, పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవనికి డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత ఇశ్రా జీవని, ములాయం సింగ్ ప్రేమించుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఇశ్రా జీవని నేపాల్ వెళ్లి తరువాత అక్రమంగా భారత్ లోకి వచ్చిందని, తరువాత ములాయం సింగ్ ను వివాహం చేసుకుందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఎన్ని డ్రామాలు ఆడారంటే ?

ఎన్ని డ్రామాలు ఆడారంటే ?

ములాయం సింగ్ ను వివాహం చేసుకున్న తరువాత ఇశ్రా జీవని ఆమె పేరు రావా యాదవ్ అని మార్చుకుందని పోలీసులు అన్నారు. ములాయం సింగ్ అతని భార్య, పాక్ యువతి ఇశ్రా జీవని అలియాస్ రానా యాదవ్ తో కలిసి బెంగళూరు చేరుకున్నారని పోలీసులు అన్నారు. రావా యాదవ్ పేరుతో పాకిస్తాన్ యువతి ఇశ్రా జీవని పాస్ పోర్టు తీసుకోవడానికి ప్రయత్నిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. తరువాత ఇద్దరిని అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు.

విదేశీ ఒప్పందం

విదేశీ ఒప్పందం

ఇశ్రా జీవని వ్యవహారం విదేశాంగ అధికారుల పరిధిలోకి వెళ్లింది. తరువాత ఇశ్రాను పాకిస్తాన్ అధికారులకు అప్పగించాలని చర్చలు జరిగాయి. బెంగళూరు పోలీసులు ఇశ్రాను పంజాబ్ లోని వాఘా సరిహద్దుకు తీసుకెళ్లారు. వాఘా సరిహద్దులో ఉన్న భారత్-పాకిస్తాన్ సైనిక అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చారు. ఇరు దేశాల సైనిక అధికారుల సమక్షంలో ఇశ్రాను పాకిస్తాన్ సైనికులకు అప్పగించారు. పాకిస్తాన్ యువతిని దేశం దాటించిన బెంగళూరు పోలీసులు ఊపిరిపీల్చుకుని ఇప్పుడు బెంగళూరు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+