బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: రిటైడ్ ప్రిన్సిపాల్, బ్యాంకు ఉద్యోగికి స్వర్గం చూపించారు, త్రిషా, పెద్దారెడ్డికి సీన్ రివర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేసిన వ్యక్తి ఇటీవల రిటైడ్ అయ్యారు. రిటైడ్ అయిన ప్రిన్సిపాల్ కు లక్షల రూపాయల డబ్బు చేతికి వచ్చింది. ఐటీ హబ్ లో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ సంపాధించి డబ్బులు సంపాధించాలని రిటైడ్ ప్రిన్సిపాల్ ఆలోచించాడు. బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ సంపాధించడానికి అతనే అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో స్నేహితుడి ద్వారా ఓ కిలాడీ లేడి రిటైడ్ ప్రిన్సిపాల్ కు పరిచయం అయ్యింది. ప్రభుత్వంలోని పెద్దలు చాలా మంది తనకు తెలుసని, నేను అనుకుంటే నీకు నెల రోజుల్లో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఇప్పిస్తానని ఆ కిలాడీ లేడీ చెప్పింది. రిటైడ్ ప్రిన్సిపాల్ ను మాట్లాడాలని చెప్పిన కిలాడీ లేడి ఆమె ఇంటికి పిలిపించుకుంది. ఇంట్లో రిటైడ్ ప్రిన్సిపాల్ ను ముగ్గులోకి దింపిన కిలాడీ లేడి అతనికి స్వర్గం చూపించింది. వయసు దాటిపోయినా నా కోరిక తీర్చిందని ఆ రిటైడ్ ప్రిన్సిపాల్ అర్దగంట సేపు హ్యాపీగా ఫీలైపోయాడు. తరువాత పెద్దారెడ్డి అండ్ కో ఎంట్రీ ఇచ్చి రిటైడ్ ప్రిన్సిపాల్ ను బ్లాక్ మెయిల్ చేసి రూ. 3 లక్షలు లాగేశారు. మరో రెండు లక్షలు డిమాండ్ చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయారు. మరో చోట బ్యాంకు ఉద్యోగిని హనీట్రాప్ తో బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసిన పోలీసులకు చిక్కిపోయారు.

Illegal affair: ఎస్ఐ భార్యకు ఇద్దరు ప్రియులు, బ్లాక్ మెయిల్ ?, స్పాట్ పెట్టి లేపేసిన ఎస్ఐ !Illegal affair: ఎస్ఐ భార్యకు ఇద్దరు ప్రియులు, బ్లాక్ మెయిల్ ?, స్పాట్ పెట్టి లేపేసిన ఎస్ఐ !

 ఐటీ హబల్ లో రిటైడ్ ప్రిన్సిపాల్

ఐటీ హబల్ లో రిటైడ్ ప్రిన్సిపాల్

ఐటీ హబ్ బెంగళూరులోని నందిని లేఔట్ లో శివరామయ్య (పేరు మార్చడం జరిగింది) అనే నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో ప్రిన్సిపాల్ కు గా ఉద్యోగం చేసిన శివరామయ్య రిటైడ్ అయ్యారు. రిటైడ్ అయిన ప్రిన్సిపాల్ శివరామయ్య చేతికి కొన్ని లక్షల రూపాయల డబ్బు చేతికి వచ్చింది. మంచి వ్యాపారం చేసి డబ్బులు సంపాధించాలని రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్య ఆలోచించాడు.

 బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ కోసం

బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ కోసం

ఐటీ హబ్ లో బార్ అండ్ రెస్టారెంట్ పెడితో ప్రతిరోజు వేలల్లో లాభాలు ఉంటాయని, ఆ వ్యాపారం చెయ్యాలని శివరామయ్యకు కొందరు సలహా ఇచ్చారని తెలిసింది. బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ సంపాధించి బెంగళూరులో వ్యాపారం చేసి డబ్బులు సంపాధించాలని రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్య ఆలోచించాడు. బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ సంపాధించడానికి శివరామయ్య అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

 త్రిషా అండ్ కో ఎంట్రీ

త్రిషా అండ్ కో ఎంట్రీ

ఇదే సమయంలో స్నేహితుడు చంద్రశేకర్ అనే వ్యక్తి నీకు త్వరగా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రావాలంటే బెంగళూరులోని శ్రీరాంపురలో నివాసం ఉంటున్న త్రిషా అనే మహిళను కలవాలని, ఫోన్ నెంబర్ కావాలంటే నేను ఇస్తానని శివరామయ్యకు చెప్పాడు. చంద్రశేఖర్ ద్వారా రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్యకు త్రిషా పరిచయం అయ్యింది.

 నందిని లేఔట్ ఆసుపత్రి దగ్గరకు వచ్చేయ్

నందిని లేఔట్ ఆసుపత్రి దగ్గరకు వచ్చేయ్

కిలాడీ లేడి త్రిషాతో రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్య పరిచయం పెంచుకున్నాడు. నందిని లేఔట్ ఆసుపత్రి దగ్గరకు రావాలని త్రిషా శివరామయ్యకు చెప్పింది. ప్రభుత్వంలోని పెద్దలు చాలా మంది తనకు తెలుసని, నేను అనుకుంటే నీకు నెల రోజుల్లో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఇప్పిస్తానని కిలాడీ లేడీ త్రిషా రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్యను నమ్మించింది.

 ఇంట్లో స్వర్గం చూపించింది.... పెద్దారెడ్డి ఎంట్రీతో సీన్ రివర్స్

ఇంట్లో స్వర్గం చూపించింది.... పెద్దారెడ్డి ఎంట్రీతో సీన్ రివర్స్

రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్యతో మాట్లాడాలని చెప్పిన కిలాడీ లేడి త్రిషా శ్రీరాంపురలోని ఆమె ఇంటికి పిలిపించుకుంది. ఇంట్లో రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్యను ముగ్గులోకి దింపిన కిలాడీ లేడి త్రిషా అతనికి బెడ్ రూమ్ లో స్వర్గం చూపించింది. వయసు దాటిపోయినా నా కోరిక తీర్చిందని ఆ రిటైడ్ ప్రిన్సిపాల్ అర్దగంట సేపు హ్యాపీగా ఫీలైపోయాడు. తరువాత పెద్దారెడ్డి అండ్ కో త్రిషా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరూ బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో వీడియోలు తీసి అతన్ని బ్లాక్ మెయిల్ చేశారు.

 రూ. మూడు లక్షలు స్వాహా

రూ. మూడు లక్షలు స్వాహా

మర్యాదగా మాకు రూ. 5 లక్షలు ఇవ్వకపోతే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని త్రీషా, పెద్దారెడ్డి,దామోదర్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి రిటైడ్ ప్రిన్సిపాల్ శివరామయ్యను బ్లాక్ మెయిల్ చేశారు. నిందితుల దెబ్బతో బెదిరిపోయిన రిటైడ్ ప్రిన్సిపాల్ వారికి రూ. 3 లక్షలు ఇచ్చాడు, మరో రెండు లక్షలు ఇవ్వాలని పదేపదే బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రిటైడ్ ప్రిన్సిపాల్ నందిని లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు త్రీషాతో పాటు పెద్దారెడ్డి, దామోదర్ మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

 హనీట్రాప్ లో బ్యాంకు ఉద్యోగి

హనీట్రాప్ లో బ్యాంకు ఉద్యోగి

బెంగళూరులో మరో సంఘటనలో బ్యాంకు ఉద్యోగి (50) ని హనీట్రాప్ లో దింపి రూ. 5 లక్షలు లాక్కొన్న మోహమ్మద్ అనే వ్యక్తిని గోవిందపుర పోలీసులు అరెస్టు చేశారు. రెండు సంవత్సరాల క్రితం పరిచయం అయిన ఉత్తర భారతదేశానికి చెందిన యువతి, మోహమ్మద్ కలిసి బ్యాంకు ఉద్యోగిని రాసలీలల్లో దింపి వీడియోలు తీసి రూ. 5 లక్షలు లాక్కొని ఇప్పుడు పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, పరారైన నిందితురాలి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
IT Hub: Five people arrested accused of honey trap in Bengaluru City in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X