బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Airways: హ్యాపీగా ఐటీ హబ్ వెళ్లాడు. బ్యాగ్ మారిపోయిందని ఎయిర్ లైన్స్ వెబ్ సైట్ హ్యాక్ ?, ట్విట్ చేసి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వేరే రాష్ట్రానికి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు అక్కడ అతని పని ముగించుకుని ఐటీ హబ్ బెంగళూరుకు విమానంలో వచ్చాడు. విమానంలో ప్రయాణం బాగా జరిగింది. ఎయిర్ పోర్టుకు చేరుకున్న టెక్కీ అతని బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిపోయిన తరువాత అతని రెండు బ్యాగులకు బదులు ఒక్కటే బ్యాగ్ ఉండటం, ఆ బ్యాగ్ కూడా మారిపోయి ఉండటంతో షాక్ అయ్యాడు. వెంటనే అతను ప్రయాణించిన విమాన సంస్థ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి నా బ్యాగ్ లు మిస్ అయ్యాయని, నా బ్యాగ్ లు నాకు ఇప్పించాలని మనవి చేశాడు. ఎన్నిసార్లు కస్టమర్ కేర్ కు ఫోన్లు చేసినా విమాన సంస్థకు చెందిన సిబ్బంది నిర్లక్షంగా వ్యవహారించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆ టెక్కీ ఆ ఇండిగో విమాన సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్ ను హ్యాక్ చేశాడు. వెబ్ సైట్ హ్యాక్ చేసిన టెక్కీ అతనితో పాటు ప్రయాణించిన ప్రయాణికుల ఫోన్ నెంబర్లు, అడ్రెస్ అన్ని కనుక్కున్నాడని తెలిసింది. తరువాత ప్రయాణికులు అందరికి ఫోన్లు చేసి అతని బ్యాగ్ ఎవరిదగ్గర ఉందో కనుక్కొని వారి దగ్గరకు వెళ్లాడు. మిస్ అయిపోయిన తన బ్యాగ్ తెచ్చుకున్నానని అతను ట్విట్ చేశాడు. తాను విమాన సంస్థ అధికారిక వెబ్ సైట్ ను ఎలా హ్యాక్ చేశాను ?, కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే సిబ్బంది ఎలా నిర్లక్షంగా వ్యవహరించారు. తరువాత నా బ్యాగ్ నేను ఎలా తెచ్చుకున్నాను అంటూ ఆ టెక్కీ అతని చేసిన ట్విట్ లో పూర్తిగా వివరించడం హాట్ టాపిక్ అయ్యింది.

Request; శ్రీలంక తమిళ ప్రజలను ఆదుకుందాము సార్, పరిస్థితులు బాగాలేవు, ప్రధాని మోదీకి స్టాలిన్ మనవి !Request; శ్రీలంక తమిళ ప్రజలను ఆదుకుందాము సార్, పరిస్థితులు బాగాలేవు, ప్రధాని మోదీకి స్టాలిన్ మనవి !

పాట్నా టూ బెంగళూరు

పాట్నా టూ బెంగళూరు

కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ)గా ఉద్యోగం చేస్తున్నాడు. బీహార్ వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు కుమార్ అక్కడ అతని పని ముగించుకుని ఐటీ హబ్ బెంగళూరుకు విమానంలో ప్రయాణించడానికి సిద్దం అయ్యాడు. ఆదివారం కుమార్ పాట్నా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించాడు.

బ్యాగ్ లు మారిపోయాయి

బ్యాగ్ లు మారిపోయాయి

విమానంలో కుమార్ ప్రయాణం బాగానే జరిగింది. కంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకున్న టెక్కీ కుమార్ అతని బ్యాగ్ తీసుకుని బెంగళూరులోని అతని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లిపోయిన తరువాత కుమార్ రెండు బ్యాగులకు బదులు ఒక్కటే బ్యాగ్ ఉండటం, ఆ బ్యాగ్ కూడా మారిపోయి ఉండటంతో అతను షాక్ అయ్యాడు.

పట్టించుకోని కస్టమర్ కేర్ సిబ్బంది ?

పట్టించుకోని కస్టమర్ కేర్ సిబ్బంది ?


వెంటనే టెక్కీ కుమార్ అతను ప్రయాణించిన ఇండిగో విమాన సంస్థ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి నా బ్యాగ్ లు మిస్ అయ్యాయని, నా బ్యాగ్ లు నాకు ఇప్పించాలని మనవి చేశాడు. ఎన్నిసార్లు ఇండిగో విమాన సంస్థ కస్టమర్ కేర్ కు ఫోన్లు చేసినా విమాన సంస్థకు చెందిన సిబ్బంది నిర్లక్షంగా వ్యవహారించారని కుమార్ ఆరోపిస్తున్నాడు.

వెబ్ సైట్ హ్యాక్ చేసిన టెక్కీ ?

వెబ్ సైట్ హ్యాక్ చేసిన టెక్కీ ?


ఇదే సమయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన కుమార్ ఇండిగో విమాన సంస్థకు చెందిన అధికారిక వెబ్ సైట్ ను హ్యాక్ చేశానని అతనే ట్విట్ చేశాడు. ఇండిగో విమాన సంస్థ వెబ్ సైట్ హ్యాక్ చేసిన తరువాత తనతో పాటు ప్రయాణించిన ప్రయాణికుల ఫోన్ నెంబర్లు, అడ్రెస్ అన్ని కనుక్కున్నానని, తరువాత ప్రయాణికులు అందరికి ఫోన్లు చేసి తన బ్యాగ్ ఎవరిదగ్గర ఉందో కనుక్కొని వారి దగ్గరకు వెళ్లి మిస్ అయిపోయిన తన బ్యాగ్ తెచ్చుకున్నానని టెక్కీ కుమార్ ట్విట్ చేశాడు.

వెబ్ సైట్ హ్యాక్ ఎలా చేశానో అని వివరించిన టెక్కీ

వెబ్ సైట్ హ్యాక్ ఎలా చేశానో అని వివరించిన టెక్కీ


తాను ఇండిగో విమాన సంస్థ అధికారిక వెబ్ సైట్ ను ఎలా హ్యాక్ చేశాను ? ల్యాప్ టాప్ లో ఏ బటన్ ప్రెస్ చేశాను, కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే సిబ్బంది ఎలా నిర్లక్షంగా వ్యవహరించారు. తరువాత నా బ్యాగ్ నేను ఎలా తెచ్చుకున్నాను అంటూ టెక్కీ కుమార్ అతను చేసిన ట్విట్ లో పూర్తిగా వివరించడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో లాగా ఇండిగో సిబ్బంది పని చెయ్యడం లేదని, వాళ్లు పూర్తిగా మారిపోయారని టెక్కీ కుమార్ ట్విట్ చేశారని కన్నడ మీడియా వార్త ప్రసారం చేసింది. అయితే ఈ విషయంలో ఇండిగో సంస్థ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

English summary
IT HUB: Indigo Airways website hack for bag change in Bengaluru ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X