విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shock: ఐటీ హబ్ లో 12% నుంచి 55% దాటిన కోవిడ్ కేసులు, ఆ రోజు నుంచి టోటల్ లాక్ డౌన్ ?, సర్దుకో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంతో సహ కర్ణాటక మొత్తం మే 12వ తేదీ తరువాత సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 % నుంచి ఏకంగా 55 % పెరిగిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. మే 12వ తేదీన లాక్ డౌన్ గడుపు పూర్తి అయిన వెంటనే కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేసే విషయంలో సీఎం బీఎస్. యడియూరప్ప డిసైడ్ చెయ్యనున్నారు. సీఎం బీఎస్. యడియూరప్ప అధ్వర్యలోం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మే 12వ తేదీ నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తరువాత సంపూర్ణ లాక్ డౌన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అంటున్నారు.

Bed Blocking: కిలాడి నేత్రావతి అందర్, ఒక్క బెడ్ రూ. 50 వేలు, ఆంటీ డీల్, ఎంపీ ఎంట్రీతో ?Bed Blocking: కిలాడి నేత్రావతి అందర్, ఒక్క బెడ్ రూ. 50 వేలు, ఆంటీ డీల్, ఎంపీ ఎంట్రీతో ?

 బెంగళూరులో 3 లక్షల పాజిటివ్ కేసులు !

బెంగళూరులో 3 లక్షల పాజిటివ్ కేసులు !

ప్రపంచ దేశాల్లో ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరం పరిస్థితి రానురాను దారుణంగా తయారౌతోంది. గత 24 గంటల్లో బెంగళూరు నగరంలో ఏకంగా 20, 870 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బెంగళూరులో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 132 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెంగళూరులో ప్రస్తుతం 3 లక్షలకు పైగా కరోనా ఆక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

 ఏం లెక్కలంటే ? ఏందిరా బాబు !

ఏం లెక్కలంటే ? ఏందిరా బాబు !

గత 24 గంటల్లో కర్ణాటకలో మొత్తం 292 మంది కరోనా పాజిటివ్ తో మరణించారు. వీరిలో 132 మంది బెంగళూరులో మరణించడంతో ప్రజలు హడలిపోతున్నారు. గత వారంలో బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 శాతం ఉంటే ఇప్పుడు ఏకంగా 55 శాతం కరోనా పాజిటివ్ కసులు నమోదు కావడంతో ఐటీ హబ్ లో కలకలం రేపింది.

 ఫోన్లు చేసి ఏం అడుగుతున్నారో తెలుసా ?

ఫోన్లు చేసి ఏం అడుగుతున్నారో తెలుసా ?

కర్ణాటకలో మంగళవారం మొత్తం 44, 532 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 20, 850 కరోనా పాజిటివ్ కేసులు బెంగళూరు నగరంలోనే నమోదు కావడంతో ప్రభుత్వం హడలిపోయింది. బెంగళూరులోని ఆరోగ్య శాఖ కంట్రోల్ రూమ్ కు ప్రతిరోజు సుమారు 4, 500కు పైగా ఫోన్లు వస్తున్నాయని, అందులో 1, 500 మంది ఆసుపత్రిలో మేము చేరాలని అడుగుతున్నారని, 500 నుంచి 550 మంది వరకు మాకు ఐసీయూ బెడ్ లు కావాలని అడుగుతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

 ప్రభుత్వం డిసైడ్ అయ్యిందా ?

ప్రభుత్వం డిసైడ్ అయ్యిందా ?

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం జరిగింది. మే 12వ తేదీతో మనం విధించిన లాక్ డౌన్ గడుపు పూర్తి అవుతుందని, తరువాత బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చెయ్యాలని చాలా మంది మంత్రులు సీఎం బీఎస్. యడియూరప్ప ముందు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిసింది.

 ప్రధానమంత్రి మోదీ ఏం చెబుతారో ?

ప్రధానమంత్రి మోదీ ఏం చెబుతారో ?

బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాతో మాట్లాడారు. మే 12వ తేదీన తాము విధించిన లాక్ డౌన్ గడుపు పూర్తి అవుతుందని అన్నారు. ఆరోజుకు కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు ఇలాగే ఉంటే సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేస్తామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము కచ్చితంగా అమలు చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప స్పష్టం చేశారు. ఇప్పటికే లాక్ డౌన్ దెబ్బతో కర్ణాటకలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తే మేము మా సొంత ప్రాంతాలకు ఎలా వెళ్లాలి ? అంటూ అయోమయంలో పడిపోతున్నారు.

Recommended Video

Salman Khan Winning Hearts | కర్ణాటక లో ఓ విద్యార్థి తండ్రి చనిపోతే..!! || Oneindia Telugu

English summary
Total Lockdown: With the steep rise in Covid-19 cases despite one week of curfew, the Karnataka govt is contemplating imposing a complete lockdown in the state for two weeks post-May 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X