IT Hub: బ్యాంకులో భార్య ముందే రౌడీషీటర్ హత్య, తుపాకికి పని చెప్పిన పోలీసులు, పక్కాస్కెచ్ !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో పట్టపగలు బ్యాంకులో రౌడీషీటర్ ను దారుణంగా నరికి చంపిన నిందితులకు పోలీసులు తుపాకి తూటాల రుచి చూపించారు. భార్య కళ్ల ముందే రౌడీషీటర్ ను దారుణంగా హత్య చేసిన నిందితులు తప్పించుకుని దర్జాగా పరారైనారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు వాళ్ల ఆచూకి తెలుసుకున్నారు. అరెస్టు చెయ్యడానికి వెళ్లిన పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించిన నిందితుల మీద పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది.

 భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్లిన రౌడీషీటర్

భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్లిన రౌడీషీటర్

ఐటీ హబ్ బెంగళూరులోని ఆడుగోడిలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ జోసెఫ్ అలియాస్ బబ్లీ అతని భార్య, కుమార్తెతో కలిసి కోరమంగలలోని 8వ బ్లాక్ లోని బ్యాంకులోకి వెళ్లాడు. కాంట్రాక్టు పనులు చేయిస్తున్న రౌడీషీటర్ బబ్లీ వెళ్లిన పని పూర్తి చేసుకోవడానికి బ్యాంకులో అధికారులతో మాట్లాడుతున్నాడు.

 బ్యాంకులో భార్య కళ్ల ముందే దారుణ హత్య

బ్యాంకులో భార్య కళ్ల ముందే దారుణ హత్య

బ్యాంకులోకి కొందరు వ్యక్తులు వెళ్లారు. పని కోసం బ్యాంకుకు వచ్చినట్లు నటించిన ప్రత్యర్థులు రౌడీషీటర్ బబ్లీని కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. భార్య కళ్ల ముందే రౌడీషీటర్ బబ్లీ దారుణ హత్యకు గురైనాడు. బ్యాంకులో పని కోసం వెళ్లిన ప్రజలు, బ్యాంకు సిబ్బంది హడలిపోయి ప్రాణభయంతో పరుగు తీశారు.

 గాలించిన పోలీసులు

గాలించిన పోలీసులు

అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అడుగోడి జోసెఫ్ అలియాస్ బబ్లీ అనేకసార్లు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. 2011 నుంచి ఎలాంటి కేసుల్లో చిక్కుకోకుండా నేరాలకు దూరంగా ఉంటున్న బబ్లీ కాంట్రాక్టు పనులు చేయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బ్యాంకులో రౌడీషీటర్ బబ్లీని దారుణంగా హత్య చేసిన నిందితుల కోసం కోరమంగళ పోలీసులు గాలించారు.

 నిందితులకు తూటాల రుచి

నిందితులకు తూటాల రుచి

బెంగళూరులోని బేగూరు చెరువు సమీపంలో రౌడీషీటర్ బబ్లీని హత్య చేసిన రవి, ప్రదీప్ అలియాస్ చోట్టే తలదాచుకున్నారని కోరమంగల ఎస్ఐ సిద్దప్పకు సమాచారం అందింది. తన సిబ్బందితో కలిసి నిందితులను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించిన పోలీసుల మీద రవి, పదీప్ దాడి చేశారు. అదే సమయంలో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రవి, ప్రదీప్ కాళ్లల్లోకి బుల్టెట్ లు దూసుకుపోయాయి.

 ఆసుపత్రిలో నిందితులు, పోలీసులు

ఆసుపత్రిలో నిందితులు, పోలీసులు

బుల్లెట్ గాయాలైన నిందితులను ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సిద్దప్పతో పాటు పోలీసులకు గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. నిందితులు రవి, ప్రదీప్ కోలుకున్న తరువాత వారిని విచారణ చేస్తామని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+