IT Hub: మహిళ కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కేసి ఏ చేశాడంటే, నోరుమూసుకుని పోకుండా !
బెంగళూరు: ఐటీ హబ్ లోకి ఎప్పుడు ఎవరు వచ్చి వెలుతున్నారో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఐటీ హబ్ దక్షిణ భారతదేశంలోనే అనేక వ్యాపారాలకు కేంద్ర బింధువుగా మారింది. ఇలాంటి ఐటీ హబ్ లో నేరాలకు ఏమి కొదవకాదని అనేకసార్లు వెలుగు చూసింది. ఇలాంటి ఐటీ హబ్ లో ఓ దొంగ చేసిన పనికి ఇంటి యజమానురాలుతో సహ పోలీసులు బిత్తరపోయారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఓ యువకుడు ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు. మహిళను అడ్రస్ అడిగే నెపంతో మాట్లాడి ఒక్కసారిగా ఇంట్లో చొరబడ్డాడు. తరువాత మహిళను కత్తితో బెదిరించిన నిందితుడు ఆమె చేతులు కాళ్లు కట్టేసి నోటిలో బట్టలు కక్కేశాడు. ఇల్లు మొత్తం చెల్లాచెదురు చేసిన నిందితుడు ఇంట్లో బీరువాలో ఉన్న రూ. 10 వేల నగదు, లక్షల రూపాయల విలువైన బంగారు నగలు దోచుకున్నాడు. నిందితుడు పోతానోతా నోరుమూసుకుని ఉండకుండా ఇంటి ఓనర్ అయిన మహిళకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు నేను 8 హత్యలు చేశాను, నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేను నిన్ను 9వ మర్డర్ చేస్తానని చెప్పి ఆమెను బెడ్ రూమ్ లోకి తోసి లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో కొన్ని గంటల్లోనే నిందితుడు పోలీసులకు చిక్కిపోవడంతో అతనికి ఉప్పు,కారం వేసి పుల్లకూర చేసి అసలు మ్యాటర్ బయటకు లాగుతున్నారు.

అడ్రస్ అడిగే నెపంతో ?
బెంగళూరులో గీతా అనే మహిళ నివాసం ఉంటున్నది. శనివారం గీతా భర్త బయటకు వెళ్లాడు. ఇంట్లో గీతా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఇంటి కాలింగ్ బెల్ వెయ్యడంతో గీతా తలుపు తీసింది. గీతా ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న రాకేష్ అనే యువకుడు ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు. గీతాను అడ్రస్ అడిగే నెపంతో మాట్లాడిన రాకేష్ ఒక్కసారిగా ఆమెను ఇంట్లోకి నెట్టేసి అతను చొరబడ్డాడు.

కత్తితో బెదిరించి ?
తరువాత గీతాను కత్తితో బెదిరించిన నిందితుడు రాకేష్ ఆమె చేతులు కాళ్లు కట్టేసి నోటిలో బట్టలు కక్కేశాడు. తరువాత ఇంటిలో ప్రతిచోట గాలించాడు. గీతా ఇల్లు మొత్తం చెల్లాచెదురు చేసిన రాకేష్ ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న రూ. 10 వేల నగదు, రూ. 1. 60 లక్షల విలువైన బంగారు నగలు దోచుకున్నాడు. అంతే కాకుండా ఇంకా విలువైన నగలు ఎక్కడ ఉన్నాయి అంటూ రాకేష్ తో పాటు మరో ఇద్దరు నిందితులు గీతాను కత్తులతో బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు.

ఇప్పటికే 8 హత్య చేశాను..... ఎక్ట్స్రాలు చేస్తే నీతో 9వ మర్డర్
రాకేష్ నోరుమూసుకుని ఉండకుండా ఇంటి ఓనర్ అయిన గీతాకు భారీ డైలాగులు వేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటి వరకు నేను 8 హత్యలు చేశాను, నువ్వు పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేను నిన్ను 9వ మర్డర్ చేస్తానని గీతాకు చెప్పి ఆమెను బెడ్ రూమ్ లోకి తోసి ఆమె మీద దాడి చేసి బయట లాక్ చేసుకుని వెళ్లిపోయాడు.

బ్లూ కలర్ షర్టు వేసుకున్న నిందితుడు
గీతా గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు విషయం గుర్తించి ఆమె ఇంటి తలుపు పగలగొట్టారు. వెంటనే గీతా పోలీసులకు సమాచారం ఇచ్చింది. బ్లూ కలర్ షర్టు వేసుకున్న నిందితుడు తన ఇల్లు లూటీ చేశాడని గీతా చెప్పింది. పోలీసులు ఆ ఏరియాతో పాటు పక్క ఏరియాల్లో పోలీసులకు బ్లూ కలర్ షర్టు వేసుకున్న యువకుడు కనపడితే విచారణ చెయ్యాలని సమాచారం ఇచ్చారు.

పోలీసు జీపు చూసిన వెంటనే ?
పోలీసులు నిందితుల కోసం జల్లెడ పట్టారు. ఆ సమయంలో పోలీసు జీపు చూసిన రాకేష్ తన కోసమే పోలీసులు వచ్చారని అనుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. వెతుకున్న నిందితుడు లడ్డూలాగా చిక్కడంతో పోలీసులు వెంటాడని రాకేష్ ను పట్టుకుని అతన్ని బెండ్ తీస్తున్నారు. రాకేష్ బ్యాచ్ లోని మిగిలిన నిందితుల కోసం ఆరా తీస్తున్నామని. రాకేష్ దగ్గర నగలు, నగదు చిక్కాయని పోలీసు అధికారులు అంటున్నారు. దొంగతనం చేసిన నిందితుడు పోతాపోతా మహిళకు ఫ్యాక్షన్ సినిమా డైలాగులు వేసి అడ్డంగా చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications