ఐటీ శాఖ దాడులు, జయానంద్ వివాదాస్పద కామెంట్, రాజకీయంగా అవసరం, అసహనం !

వివాదాస్పద కామెంట్ చేసిన శశికళ మేనల్లుడు, రూ. 30 వేల కోట్ల ఆస్తిఐటీ దాడులు రాజకీయంగా అవసరం, 70 గంటలు సోదాలు మాకు అనుభవంమండిపడుతున్న శశికళ అనుచరులు, అతని తండ్రి దివాకరన్ కు ఐటీ శాఖ నోటీసులు

చెన్నై: ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపణలు రావడంతో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తులు శశికళ కుటుంబ సభ్యులకు ఉన్నాయని వెలుగు చూసింది.

ఆదాయశాఖ లెక్కల్లోలేని రూ. 1, 430 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఆదాయపన్ను శాఖ అధికారుల దెబ్బతో శశికళ ఫ్యామిలీ దిమ్మ తిరిగింది. ఐటీ శాఖ అధికారుల విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ శశికళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

IT interrogation is essential politics says Jeyanandh

శశికళ సోదరుడు దివాకరన్ ఇంటిలో, కార్యాలయంలో, ఆయన విద్యాసంస్థలో సోదాలు చేసిన ఐటీ శాఖ వర్గాలు విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ తన ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

70 గంటల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారని, ఇది మాకు చక్కటి అనుభవం, రాజకీయంగా ఐటీ శాఖ దాడులు ఎంతో అవసరం అయ్యాయని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. రాజకీయ ఒత్తిడితో ఐటీ శాఖ దాడులు చెయ్యలేదని శశికళ మేనల్లుడు, జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్, అతని సోదరి కృష్ణప్రియ మీడియాకు చెప్పిన ఒక్క రోజు తరువాత జయానంద్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో శశికళ అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+