మాయ‌మైన ఐ ఇన్నాళ్ల‌కు తిరిగొచ్చింది: కుర్చీపై ఆశ‌తో పేరు మార్చుకున్న మాజీ సీఎం!

బెంగ‌ళూరు: ఏ రాజ‌కీయ నాయ‌కుడికైనా క‌న్ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీదే ఉంటుంది. రాజ‌కీయాల్లో అడుగు పెట్టేది ఆ ఉన్న‌త స్థానం కోసమే. అలాంటిది మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసినా, ఏనాడూ అయిదేళ్ల పాటు అధికారాన్ని అనుభ‌వించ లేదు క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప అలియాస్ బీఎస్‌వై. కుర్చీ కోసం ఇప్ప‌టికే ఆయ‌న ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. మ‌రోసారి ఆయ‌న చేతికి అందేంత ద‌గ్గ‌రగా వ‌చ్చింది ముఖ్య‌మంత్రి గ‌ద్దె. నాలుగోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు. ఈ సారైనా చివ‌రికంటా ప‌ద‌విలో కొన‌సాగాల‌ని ఆయ‌న బ‌లంగా అకాంక్షిస్తున్నారు. దీనికోసం త‌న పేరులో మార్పులు చేసుకున్నారు.

య‌డ్యూర‌ప్ప‌.. ఇక య‌డియూర‌ప్ప‌!

నిజానికి- య‌డ్యూర‌ప్ప అస‌లు పేరు య‌డియూర‌ప్ప‌. 2007 వ‌రకు ఆయ‌న పేరు య‌డియూర‌ప్పే. 2008లో జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌)తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌రువాత ఆయ‌న త‌న పేరులో మార్పులు చేసుకున్నారు. ఆంగ్ల అక్ష‌రాల్లోని ఐని తొల‌గించారు. య‌డ్యూర‌ప్ప ( Yedyurappa)గా మారారు. అదే పేరుతో ఇప్ప‌టిదాకా కొన‌సాగారు. ఓ జ్యోతిష్య‌డి సూచ‌న మేర‌కు ఆయ‌న త‌న పేరులోని ఐని తొల‌గించుకున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని రెండున్న‌రేళ్ల పాటు అనుభ‌వించాలానే ఒప్పందంతో బీజేపీ-జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి రెండున్న‌రేళ్ల పాటు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అనుభ‌వించిన కుమార‌స్వామి.. ఆ త‌రువాత మొండికేశారు. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టే ఇచ్చి..వారంరోజుల‌కే ఉపసంహ‌రించుకున్నారు. ఫ‌లితంగా- త‌న ప‌ద‌విని కోల్పోవాల్సి వ‌చ్చింది య‌డ్యూర‌ప్ప‌కు.

It is all in the ‘i’ for Yediyurappa

క‌లిసి రాని అదృష్టం..

2011లో బీజేపీకి గుడ్ బై చెప్పారు య‌డ్యూరప్ప‌. సొంతంగా క‌ర్ణాట‌క జ‌న ప‌క్ష పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఆయ‌న త‌న పేరును మార్చుకున్నారు. త‌న పేరు ఆంగ్ల అక్ష‌రాల్లో అద‌నంగా ఓ డీ (Yeddyurappa) ని జోడించుకున్నారు. 2014 లోక్‌స‌భ ఎన్నికల్లో ఆయ‌న ఇదే పేరుతో శివ‌మొగ్గ నుంచి పోటీ చేసి, ఘ‌న విజ‌యం సాధించారు. ఇలా ఆయ‌న త‌న రాజ‌కీయ జీవితంలో గెలుపోట‌ముల‌ను ఆధారంగా చేసుకుని మూడుసార్లు త‌న పేరు ఆంగ్ల అక్ష‌రాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ- ఎప్పుడూ పూర్తికాలం పాటు అధికారాన్ని అనుభ‌వించ‌లేక‌పోయారు. తాజాగా- మ‌రోసారి పేరును స‌వరించుకున్నారు. పాత విధానాన్నే తెర‌పైకి తీసుకొచ్చారు. మొద‌ట్లో మాయ‌మైన ఐ తిరిగి చేర్చుకున్నారు. య‌డియూర‌ప్ప (Yediyurappa) మారిపోయారు. ఇది ఎన్నాళ్లు ఉంటుందో ఎవ‌రికీ తెలియ‌దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+