BBC: ఢిల్లీ బీబీసీ ఆఫీస్‍లో ఐటీ సోదాలు.. మండిపడుతున్న ప్రతిపక్షాలు..
ఢిల్లీ బీబీసీ ఆఫీస్‍లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఢిల్లీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఉద్యోగుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులు కూడా కార్యాలయాన్ని వదిలి త్వరగా ఇంటికి వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది.ఆదాయపు పన్ను శాఖ ఢిల్లీ బృందం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలోని BBC ప్రాంగణాన్ని కూడా పర్యవేక్షిస్తోంది. ఈ సోదాల్లో 60-70 మంది అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.
BBC డాక్యుమెంటరీ
బీబీసీ ఆఫీస్ ల్లో ఐటీ దాడులపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై మండిపడింది. ఈ మేరకు ట్వీట్ "మొదట BBC డాక్యుమెంటరీ వచ్చింది. దాన్ని నిషేధించారు. ఇప్పుడు బీబీసీపై ఐటీ దాడులు చేసింది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ" అని ట్వీట్ చేసిందికాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ "అదానీ విషయంలో జేపీసీని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వానికి అదాని కింటే బీబీసీని ఇబ్బంది పెట్టడమే ప్రధాన్య అంశంగా ఉంది" అని అన్నారు.

గుజరాత్ అల్లర్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద డాక్యుమెంటరీ సిరీస్‌లో బీబీసీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. 'ఇండియా: ది మోదీ క్వశ్చన్'. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని డాక్యుమెంటరీ చార్ట్ చేస్తుంది. అల్లర్ల సమయంలో ఆయన నాయకత్వాన్ని కూడా ప్రశ్నించింది.
ట్విట్టర్, యూట్యూబ్
డాక్యుమెంటరీకి లింక్‌లను బ్లాక్ చేయమని ట్విట్టర్, యూట్యూబ్‌ని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ మీడియాలో స్నిప్పెట్‌లను పోస్ట్ చేయకుండా ప్రజలను నిషేధించింది. దాని సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం అత్యవసర అధికారాలను అమలు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డాక్యుమెంటరీని ప్రచారంలో భాగంగా కొట్టిపారేసింది, అది నిష్పాక్షికత లేదు. వలసవాద వైఖరిని ప్రదర్శిస్తుంది" అని పేర్కొంది.
సుప్రీం కోర్టు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "వావ్, నిజంగానే? ఇంత ఊహించలేదు" అని అన్నారు. కాగా దేశంలో బీబీసీని నిషేదించాలని ఇటివల సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. దేశ అత్యన్నత న్యాస్థానం దాన్ని కొట్టి వేసింది. మరోవైవు బీబీసీ డాక్యుమెంటరీ నిషేధించడంపై సుప్రీం కోర్టు విచారణ చెపట్టింది.












Click it and Unblock the Notifications