బెంగళూరు గర్ల్స్ పీజీలో అరాచకం ?, పీజీ యాజమాన్యం ఏం చేసిందంటే ?, వీడియో వైరల్ చేసి !

బెంగళూరు సిటీల్లోని పీజీలో చేరాలనుకునే అమ్మాయిలు ఈ స్టోరీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తక్కువ డబ్బుకు గది దొరికితే మంచి తిండి లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. డబుల్‌ షేరింగ్‌, 4 షేరింగ్‌, 8 షేరింగ్‌లో తక్కువ ఖర్చులతో, తక్కువ అద్దెతో పీజీలో గదిని పొందాలనుకుంటే లేనిపోని సమస్యలు ఎదురౌతాయని వెలుగు చూసింది. ముందుగా చెప్పేది ఒక్కటి, తరువాత పీజీ యజమానులు చేసేది ఒక్కటి అని తెలిసింది.

పీజీలో చేరిన తర్వాత అక్కడ ఉన్న అరాకొర సదుపాయాలపై ప్రశ్నించిన అమ్మాయిలను ఆ పీజీ యజమాని బెదిరించిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ప్రశ్నించినందుకు సమాధానం చెప్పకుండా ఆ పీజీ యాజమాన్యం గూండాల్లా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు నగరంలోని మహాలక్ష్మి లే అవుట్‌లోని ప్రేమ అనే పీజీలో ఈ ఘటన చోటుచేసుకుందని బాధిత మహిళలు వీడియోలో ఆరోపించారు.

It is the same PG management that tried to attack the girls residing in the PG in Bengaluru city.

ప్రేమ పీజీలో పీజీకి వచ్చిన యువతులు ఈ గొడవతో విసిగిపోయి ఇప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. పీజీలో ఎక్కడ చూసినా దోమలు ఉన్నాయని, తినే తిండిలో పురుగులు, బొద్దింకలు దర్శనమిస్తున్నాయని, తాగేందుకు మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవని ఆ పీజీల్లోని అమ్మాయిలు ఆరోపించారు. ఇదే సమయంలో ఆ ప్రేమ పీజీ యువతులు ఆ దారుణానికి సంబంధించిన వీడియోను తీసి దానిని వైరల్ చేశారు.

మహాలక్ష్మి లేఔట్ లోని బోవిపాళ్యలో ప్రేమ పీజీలో గందరగోళం నెలకొని గొడవ జరిగిందని వీడియోలో స్పష్టంగా తెలిసింది. పీజీ చూసుకునే కల్పనా ఆంటీ కర్రలతో ఆ పీజీలో నివాసం ఉంటున్న అమ్మాయిలను బెదిరిస్తున్న సమయంలో కొందరు అమ్మాయిలు వీడియో తీశారు. ఇదే సమయంలో అదే పీజీలో ఉంటున్న కొందరు యువతులు ఆ వీడియోలో పలు ఆరోపణలు చేశారు. ఈ పీజీ మహాలక్ష్మి లేఔవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అయితే ఇంత వరకు పీజీ యాజమాన్యంపై యువుతులు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చెయ్యలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారని కన్నడ మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+