బాలీవుడ్ నటి చెంపపై కొట్టిన వ్యక్తికి ఢిల్లీలో చుక్కెదురు!?

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, మోడల్ గౌహర్ ఖాన్ పొట్టి దుస్తులు ధరించిందని ఓ వ్యక్తి ఆమె చెంప చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. అతను నాలుగు రోజులుగా ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడట! ఎవరైన అమ్మాయిలు పొట్టి దుస్తులతో కనిపిస్తే వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాడట!

అలా ఎందుకు కొడుతున్నావంటే.. తాను సంప్రదాయ కుటుంబంలో పుట్టానని, అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించవద్దని తాను ఎప్పుడు చెబుతుంటానని, అది నైతికత కాదని వ్యాఖ్యానిస్తున్నాడంట. తాను ఏ అమ్మాయితోను డేటింగ్ చేయలేదని, ఎవరైనా షార్ట్ డ్రెస్ వేసుకుంటే తనకు కోపం వస్తుందని చెప్పాడట.

ఇతను ఇప్పటి వరకు దాదాపు 99 మంది యువతుల చెంప చెళ్లుమనిపించాడట. అయితే, వారెవరు ఫిర్యాదు చేయలేదంట. ఇతను ఇప్పుడు ఢిల్లీలో షార్ట్ డ్రెస్ వేసుకునే యువతులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్నాడట. అయితే, చలికాలం అయినందున అందరు ఫుల్ డ్రెస్ వేసుకోవడంతో.. అతను గోవాకు మారాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.

'It makes me angry that a man thought its okay to slap a woman'

కాగా, ఇతను బాలీవుడ్ నటి చెంప చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హాట్ గర్ల్ గౌహర్ ఖాన్ పైన చేయి చేసుకున్నాడు. నా పేరే కాంచనమాల.. నా వయసే గరం మసాలా.. అంటూ శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో ఆడిపాడిన హాట్‌ గర్ల్‌ గౌహర్‌ఖాన్.

ఒక ముస్లింవై ఉండీ ఇలాంటి దుస్తులు వేసుకుంటావా అంటూ నటి, మోడల్‌ గౌహర్ ఖాన్‌ చెంప ఛెళ్లుమనిపించాడు ఓ యువకుడు. అక్కడితో ఆగకుండా.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి పేరు మాలిక్‌ అకిల్‌. గోరేగావ్‌ శివార్లలోని ఫిలిం సిటీలో ఇండియాస్‌ రా స్టార్‌ అనే రియాలిటీ షోని ఆమె నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఈ షోకు హాజరవుతున్నాడు. ఆదివారం నాడు ప్రేక్షకుల్లోని అకిల్‌ ఈ దాడికి పాల్పడ్డాడు.

దీనిపై, గౌహర్ ఖాన్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి మహిళను కొట్టేంత ధైర్యం చేయడం తనకు కోపం తెప్పించిందని రెండు రోజుల క్రితం గౌహర్ అన్నారు. చెక్ చేయకుండా అతనిని ఎలా అనుమతించారని ఆమె ప్రశ్నించారు. తనకు న్యాయవ్యవస్థ పైన నమ్మకం ఉందని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+