గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: వివిధ సంస్థల సర్వేల ఫలితాలు ఇలా

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాని మోడీకి, కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్న రాహుల్ గాంధీకి ఇవి పరీక్ష. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వన్ సైడ్ ఉండవని, పోటాపోటీ ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

  Gujarat Assembly Election Opinion Poll : Congress Gains Ground

  సీఎంగా.. ప్రధానిగా ఇలా: గుజరాత్‌లో తగ్గిన మోడీ ప్రతిష్ట, మంచి వ్యూహంతో షాకిస్తున్న కాంగ్రెస్

  జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అమలు తర్వాత ప్రజల్లో బీజేపీ పట్ల ఎలాంటి భావన ఉందో తెలుసుకునేందుకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. తొలుత బీజేపీకి ఇబ్బంది అని, ఆ తర్వాత సులభంగా గెలుస్తుందని, తాజాగా పోటా పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

   దేశం మొత్తం గుజరాత్ వైపు

  దేశం మొత్తం గుజరాత్ వైపు

  దేశం మొత్తం ఇప్పుడు గుజరాత్ ఎన్నికల వైపు చూస్తుంది. బీజేపీ గెలిస్తే ప్రధాన మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు తమ సత్తా నిరూపించుకున్నట్లే. 2019 ఎన్నికలకు ముందు మోడీ హవా తగ్గలేదని బీజేపీకి చెప్పుకునే అవకాశం దక్కుతుంది. కాంగ్రెస్ గెలిచినా లేదా బీజేపీ తక్కువ సీట్లతో గెలిచినా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరట. తాజాగా లోక్‌నీతి-సీఎన్‌డీఎస్-ఏబీపీ సర్వేలో బీజేపీకి 100లోపు సీట్లు వస్తాయని తేలింది. పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ క్రమంగా పట్టు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

   తాజా అంచనాలు, బీజేపీ ఆశలపై నీళ్లు

  తాజా అంచనాలు, బీజేపీ ఆశలపై నీళ్లు

  ఈ నేపథ్యంలో ఏప్పుడెప్పుడు ఏ సర్వేలు ఏం చెప్పాయనే అంశంపై చర్చ సాగుతోంది. లోక్‌నీతి-సీఎన్‌డీఎస్-ఏబీపీ ఇప్పటి వరకు నాలుగుసార్లు ఓటర్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాయి. రెండు పార్టీలకు సమానంగా 43 శాతం వంతున ఓట్లు పడతాయని తాజా అంచనాలు వచ్చాయి. గెలిచే స్థానాల్లో మాత్రం బీజేపీ ఓ అడుగు ముందు ఉంది. 182 స్థానాలకు గాను బీజేపీ 91-99, కాంగ్రెస్ 78-76 మధ్య సాధిస్తుందని అంచనా వేశారు. తాజా అంచనాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి.

   అదే సంస్థ సర్వేలో నాలుగుసార్లు ఏం తేలిందంటే

  అదే సంస్థ సర్వేలో నాలుగుసార్లు ఏం తేలిందంటే

  ఇదే సంస్థలు ఆగస్టులో చేసిన సర్వేలో బీజేపీకి 150కి పైగా, కాంగ్రెస్‌కు 30 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇదే సంస్థ ఆగస్టులో చేసిన సర్వేలో బీజేపీకి 144-152 సీట్లు, కాంగ్రెస్ 26-32 సీట్లు వస్తాయని, సెప్టెంబరులో చేసిన సర్వేలో బీజేపీకి 148 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌కు 29 సీట్లు వస్తాయని, అక్టోబర్ నెలలో బీజేపీకి 113-121 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 58-64 సీట్లు వస్తాయని పేర్కొంది. తాజా అంచనాల్లో పోటాపోటీగా ఉన్నాయి.

   గుజరాత్‌లో ఏ ప్రాంతాల్లో ఎవరు అంటే

  గుజరాత్‌లో ఏ ప్రాంతాల్లో ఎవరు అంటే

  తాజా అంచనాల్లో ఉత్తర గుజరాత్, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ మెరుగ్గా ఉందని, సౌరాష్ట్ర, మధ్యగుజరాత్‌ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందని, సంప్రదాయ పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో రెండు పార్టీలకూ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయని అంచనాకు వచ్చాయి. పట్టణాల్లో బీజేపీదే పైచేయిగా ఉందని, పల్లెల్లో కాంగ్రెస్‌ కొంతముందంజలో ఉందని పేర్కొంది.

  ఏ సర్వే ఏం చెప్పిందంటే

  ఏ సర్వే ఏం చెప్పిందంటే

  టైమ్స్ నౌ - వీఎంఆర్ అక్టోబర్ నెలలే చేసిన సర్వేలో బీజేపీకి 126, కాంగ్రెస్‌కు 55, ఇండియా టుడే - యాక్సిస్ అక్టోబరులో చేసిన సర్వేలో బీజేపీకి 118, కాంగ్రెస్‌కు 61 సీట్లు వస్తాయని, ఇదే సర్వేలో నవంబర్ నెలలో బీజేపీకి 115-125 సీట్లు, కాంగ్రెస్‌కు 57-65 మధ్య సీట్లు వస్తాయని అంచనా వేసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The election in the Gujarat is held in two stages. the first phase of voting will begin on December 9 followed by the second phase on December 14. The results will be declared on December 18.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి