మా కొంప ముంచడానికి రూ వెయ్యి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఐటీ మంత్రి సంచలన వ్యాఖ్యలు !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోందని కర్ణాటక ఐటీ బీటీ శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. ఇదే సమయంలో మంత్రి ప్రియాంక్ ఖార్గే బీజేపీపై మండిపడ్డారు. ఆపరేషన్ కమల కోసం బీజేపీ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్దం అయ్యిందని మంత్రి ప్రియాంక్ ఖార్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే తపనతో కర్ణాటక బీజేపీ నేతలు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను రూ.1,000 కోట్లు అడిగారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ఆపరేషన్ కమలాకు శ్రీకారం చుట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు.

బీజేపీ బృందం నుంచి నాకు ఎలాంటి ఆఫర్ రాలేదని, అయితే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అలాంటి ఆరోపణలు చెయ్యడంతో కర్ణాటక రాష్ట్రంలో ఆపరేషన్ కమలా ప్లాన్ ను తోసిపుచ్చలేమని మంత్రి ప్రియాంక్ ఖార్గే విలేకరులతో అన్నారు. ఆపరేషన్ కమల మూలాలు మొదటి నుంచి కర్ణాటకలో ఉన్నాయని, దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేసిన భాజపా ట్రాక్ రికార్డు నెలకొల్పిందని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు

2019లో కర్ణాటకలో కూడా అలాగే బీజేపీ చేయలేదా?, మధ్యప్రదేశ్‌లో కూడా అలా చేయలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదని, బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేసి, ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చి నగదు ఎరవేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. బీజేపీకి మెజారిటీ లేని మహారాష్ట్ర, బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్‌లో బీజేపీ హైకమాండ్ ఇలాగే ఆపరేషన్ కమలాతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.
కర్ణాటక ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెయ్యి కోట్ల రూపాయలు బీజేపీ నాయకులకు ఇచ్చారని, అయితే వారిపప్పులు ఇక్కడ ఉడకవని, మేమే ప్రభుత్వాన్ని నడిపిస్తామని మంత్రి ప్రియాంక్ ఖార్గే ధీమా వ్యక్తం చేశారు. ఆపరేషన్ కమల్ చేస్తున్న వారు నన్ను సంప్రదించలేదని, మేమంతా పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే అని, మా దగ్గరికి వాళ్లు రాలేదని మంత్రి ప్రియాంక్ ఖార్గే అన్నారు.












Click it and Unblock the Notifications