5 వేల పట్టు చీరలు, ఓటర్ల పేరుతో డీడీలు, కేజీఎఫ్ బాబు మాయాజాలం, ఐటీ దెబ్బతో !
బెంగళూరు/కోలారు: బెంగళూరు నగరంలోని చిక్కపేట్ అసెంబ్లీ నియోజక వర్గంలో భార్యతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త కేజీఎఫ్ బాబు ఇంటిలో, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖ అధికారుల దెబ్బతో కేజీఎఫ్ బాబుకు సినిమా కనపడింది. వేలాది పట్టుచీరలు, డీడీలు సీజ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ప్రకటించక ముందే గత బుధవారం కేజీఎఫ్ బాబు ఆయన భార్య షాజియా తరనమ్ తో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. భార్యతో నామినేషన్ వేయించి కేజీఎఫ్ బాబు తనకు సీటు ఇవ్వపోతే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఆరోజే ప్రకటించారు. మాజీ మేయర్ గంగాబికే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వెయ్యడంతో ఆమెతో కేజీఎఫ్ బాబు రాజీ అయ్యారు.
కేజీఎఫ్ బాబు కు బుధవారం ఐటీ శాఖ అధికారులు వారికి షాక్ ఇచ్చారు. బుధవారం బెంగళూరులోని హైగ్రౌండ్స్ సమీపంలోని కేజీఎఫ్ బాబు ఇంటిలో, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కేజీఎఫ్ బాబు మీద చాలా రోజు నుంచి ఐటీ శాఖ అధికారుల కన్నుపడింది.
ఐటీ శాఖ అధికారుల సోదాల్లో దిమ్మతిరిగి వివరాలు బయటకు వచ్చాయని తెలిసింది.

కేజీఎఫ్ బాబు ఇంటిలో ఒక్కో చీర రూ. 5, 000 వేల విలువైన ఐదు వేల కంచి పట్టు చీరలు, రూ. 1. 105 విలువైన డీడీలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని కన్నడ మీడియా అంటోంది. డీడీల మీద చిక్కపేట్ లోని ఓటర్ల పేర్లు ఉన్నాయని అధికారులు అంటున్నారు. లక్షల విలువైన 5 వేల కంచిపట్టు చీరలను చిక్కపేట్ ఓటర్లకు పంచిపెట్టడానికి కేజీఎఫ్ బాబు ప్రయత్నించారని తెలిసింది.
కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు బెంగళూరు, మంగళూరు, మైసూరులో కేజీఎఫ్ బాబుకు చెందిన ఆస్తులు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అప్పటి నుంచి కేజీఎఫ్ బాబు మీద ఐటీ శాఖ అధికారులు డేగ కన్ను వేశారని సమాచారం. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన కేజీఎఫ్ బాబు ఏదో చెయ్యాలని అనుకుంటే అది ఏదో అయిపోందని చిక్కపేట్ ఓటర్లు అంటున్నారు.












Click it and Unblock the Notifications