ఈ సిటీలోను భద్రత లేదని తెలిసింది: ఫ్యాషన్ డిజైనర్ పట్ల టెక్కీ అనుచిత ప్రవర్తన

ఫ్యాషన్ డిజైనర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో 36 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజినీర్‌ను అంబోలీ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. సోమవారం దాదాపు 45 నిమిషాల పాటు ఆమెన వేధించాడు.

ముంబై: ఫ్యాషన్ డిజైనర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో 36 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజినీర్‌ను అంబోలీ పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. సోమవారం దాదాపు 45 నిమిషాల పాటు ఆమెన వేధించాడు.

నిందితుడిని నితేష్ కుమార్(36)గా గుర్తించారు. బాధితురాలు అదితి నాగ్‌పాల్. యువతి అంధేరి వెస్ట్‌లో ఉంటోంది. నిందితుడు ఆమెను ఆమె నివాసం ఉండే తొలి అంతస్తు వరకు ఫాలో అయ్యాడు. అంతేకాదు, ఆమె ఇంటి కాలింగ్ బెల్ కూడా కొట్టాడు.

వెంటనే యువతి గట్టిగా అరిచింది. దీంతో అతను భవనం కిందకు వెళ్లాడు. అతను తన కారు వద్ద నిలుచొని, అదే పనిగా ఆమె ఫ్లాట్ వైపు చూశాడు.

చండీగఢ్‌లో వర్ణిక వేధింపుల అంశం వెలుగు చూసిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం.

ఈ సంఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించి పోస్ట్ కూడా పెట్టింది. గత పదేళ్లుగా ముంబైలో తాను భద్రంగా ఉన్నట్లు భావిస్తూ వచ్చానని, కానీ ఈ నగరం కూడా అంత క్షేమం కాదని గత రాత్రి అర్థమైందని ఆమె పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+