పాకిస్తాన్ కు ముందుంది ముసళ్ల పండగ- ప్రతి ఇంచీ భారత కనుసన్నల్లో: అది జస్ట్ ట్రైలర్ ఓన్లీ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశం పాకిస్తాన్ ను మరోసారి హెచ్చరించారు. సరిహద్దుల్లో ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా గానీ తాము ఇచ్చే సమాధానం వేరుగా ఉంటుందని తెలిపారు. ఈ విషయం ఇప్పటికే ఒకసారి రుజువైందని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆవిర్భావంపైనా మాట్లాడారు రాజ్‌నాథ్ సింగ్. ఆ దేశానికి జన్మనిచ్చిందే భారత్ అనే విషయాన్ని మరిచిపోకూడదని చెప్పారు.

ఉత్తరప్రదేశ్ లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌లో తయారుచేసిన మొట్టమొదటి బ్రహ్మోస్ క్షిపణుల బ్యాచ్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను ఉత్పత్తి చేసే బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఇది. దీన్ని ప్రారంభించిన అనంతరం రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా హెచ్చరికలు పంపించారు.

It was just a trailer Every Inch of Pakistan Under BrahMos Range says Rajnath Singh

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను గుర్తు చేశారు. ఉగ్రవాదం, దాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ కు ఆపరేషన్ సింధూర్ ఓ ట్రైలర్ మాత్రమేనని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి రేంజ్ లోకి వచ్చిందని, ఆ దేశానికి చెందిన ఏ మారుమూల ప్రాంతాన్నయినా ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ మిస్సైళ్లకు ఉందని పేర్కొన్నారు.

దేశ రక్షణ శాఖ శక్తి సామర్థ్యాలకు ఆపరేషన్ సింధూర్ ఓ నిలువెత్తు ఉదాహరణగా, కీలక మలుపుగా అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ అనే ట్రైలర్ నుంచే పాకిస్తాన్‌కు భారత్ అంటే ఏమిటో అర్థమైందని రాజ్ నాథ్ అన్నారు. పాకిస్తాన్‌కు జన్మనిచ్చిందే భారత్ అని గుర్తు చేశారు. "అవసరమైనప్పుడు అది కూడా.." అని పూర్తిస్థాయి యుద్ధం గురించి పరోక్షంగా హెచ్చరించారు. అదేంటనేది తాను చెప్పాల్సిన పనిలేదని, అందరికీ సులువుగానే అర్థమౌతుందని పేర్కొన్నారు.

సాయుధ దళాల నిబద్ధతను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ అధునాతన క్షిపణి సామర్థ్యాల నుండి శత్రువులెవరు కూడా తప్పించుకోలేరని, ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత్ తీసుకునే ప్రతి చర్య కూడా విజయవంతమౌతుందనడానికి ఆపరేషన్ సింధూర్ ఓ నిదర్శనమని, ఆర్మీ.. గెలవడాన్ని ఓ అలవాటుగా మార్చుకుందని ప్రశింసించారు. ఈ విజయం దేశ భద్రత పట్ల ఆర్మీకి ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+