మీ వల్లే వరదలు: తమిళనాడుపై కేరళ సంచలనం, ముళ్లపెరియార్ ఎందుకు కారణం?
Recommended Video

తిరువనంతపురం: తమ రాష్ట్రంలో భారీ వరదలు, అపార నష్టానికి తమిళనాడు కారణమని కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు చేసింది. ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యాంలోకి చేరిందని దీంతో పెను ప్రమాదం సంభవించిందని పేర్కొంది.
ఈ మేరకు కేరళ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ముళ్ల పెరియార్ డ్యాం నుంచి భారీగా నీరు రావడంతో ఇడుక్కి డ్యాం 15 గేట్లు ఎత్తివేశామని, దీంతో కేరళ అల్లకల్లోలంగా మారింది ఆరోపించింది.
తమిళనాడు ప్రజలకు నీటిని అందించే ముళ్లపెరియార్ డ్యాంను కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని నిర్వహణ తమిళనాడు రాష్ట్రానిదే. డ్యాం పాతది కావడం వల్ల కూల్చివేసి కొత్త డ్యాం కట్టాలని కేరళ చాలాకాలంగా చెబుతోంది. డ్యాంలో నీటిస్థాయిని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. తమిళనాడు నుంచి ఆశించిన స్పందన లేదు. ఈ కారణంగా డ్యాం నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే కేరళ ఇంత నష్టపోయిందని ఆ రాష్ట్రం సుప్రీం కోర్టులో చెప్పింది.

కేరళ జనాభా 3.48 కోట్లు. ఇందులో 54 లక్షల మంది ప్రజలు ఈ వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లా పెరియార్ నది సమీపంలోని థెక్కడి దగ్గరి వెస్టర్న్ ఘాట్ వద్ద ముళ్లపెరియార్ డ్యాం ఉంది.
ముళ్లపెరియార్ డ్యాం నుంచి నీటిని క్రమంగా విడతలవారిగా విడుదల చేయాలని కోరామని, కానీ తమ విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోలేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది.
ముళ్ల పెరియార్ డ్యాం కారణంగా ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్‌తో పాటు రెండు రాష్ట్రాలు సభ్యులుగా సూపర్ వైజరీ కమిటీ ఉందని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు లేదా ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ముళ్లపెరియార్ డ్యాం నిర్వహణపై కేరళ ప్రభుత్వం కూడా ఎప్పటికి అప్పుడు సమాచారం అడుగుతోందని చెప్పింది. కాగా, కేరళలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీసుకున్న చర్యలు, ఏం చేస్తున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆగస్ట్ 18న కేరళ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications