ఐఎస్ఐస్ లింక్స్: అతన్ని ఎలా పట్టుకున్నారు?
బెంగళూరు: సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ట్విట్టర్ ఖాతను నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న మెహిదీ మస్రూర్ బిశ్వాస్‌ను పోలీసులు తెలివిగా పట్టుకున్నారు. సర్వర్ లాగ్స్‌కు వెళ్లి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపి) చిరునామాను కనుక్కుని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా పోలీసులు పాత పోలీసు శైలిని ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనం ఎన్డీటీవీ ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం - ఐపి చిరునామాను కనుక్కోవడానికి ప్రయత్నించే బదులు పోలీసులు టీ - షర్ట్‌ను గుర్తించే ప్రయత్నాల్లో పడ్డారు. @ShamiWitness అనే ఐఎస్ఐఎస్ ఖాతాను నిర్వహించిన బెంగళూర్ ఎగ్జిక్యూటివ్‌పై వార్తాకథనం ప్రసారం చేసిన చానెల్ 4 న్యూస్ అనుమానితుడి చిత్రాలను ప్రసారం చేసింది. అయితే, ముఖం ఆనవాళ్లు పట్టడానికి వీల్లేకుండా బ్లర్ చేసింది. అయితే, అతను ధరించి టీ షర్ట్ మాత్రం స్పష్టంగా కనిపించింది. దానికి తోడు అతని గొంతు కూడా సాయం చేసింది. వాయిస్ అనాలిసిస్ టెస్టులో అతను 20 ఏళ్ల పడిలో ఉంటాడని అర్థం చేసుకున్నారు. దానికి తోడు, అతను మాట్లాడే ఆంగ్లభాష బెంగాలీ యాసను పోలి ఉంది.

దర్యాప్తు అధికారులపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ సమయంలోనే కొంత మంది ఫేస్ బుక్ పేజీలను ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పరిశీలిస్తూ వచ్చారు. చానెల్ 4లో చూపించిన వ్యక్తి ధరించిన టీ షార్ట్ ధరించిన వ్యక్తి చిత్రాల కోసం పరిశీలిస్తూ వచ్చారు. తద్వారా కొన్ని వందల ప్రొఫైల్స్‌ను వెలికి తీశారు.
అదే సమయంలో మరో పని కూడా చేశారు. మెహిదీ పేరు మీద ఉన్న ఫోన్ నెంబర్లను క్రోడీకరిస్తూ వచ్చారు. సీనియర్ హోదాల్లో ఉన్న వాళ్లు చాలా మంది కనిపించారు. వారందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం సరి కాదని భావించారు. అలా చేస్తే చాలా మందికి నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. బెంగాలీ యాసతో మాట్లాడిన యువకుడు అని అనుకుని ఆ జాబితాను పోలీసులు కుదించారు.
ఆ కాల్ రికార్డులను పరిశీలిస్తే చాలా మందివి సాధారణ సంభాషణల్లాగే కనిపించాయి. వాటిలో ఒక్కటి మెహిదీ మస్రూర్ బిశ్వాస్‌కు వెళ్లింది. బెంగాలీ యువకుడు, 20 ఏళ్ల వయస్సులో ఉన్నవాడు, ఇంజనీరు, బెంగళూర్‌లో ఉంటున్నాడు అనే విషయాల్లో మ్యాచ్ అయింది.
బిశ్వాస్ లిస్ట్ చేసిన పబ్లిక్ ప్రొఫైల్స్‌లో గురునానక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లభించిది. అది పశ్చిమ బెంగాల్‌లో సోదేపూర్. కాలేజీ వివరాలు అతని ఉద్యోగం, ఫొటోలను తెలిపాయి. మిగతా అంతా చాలా సులభంగా జరిగిపోయింది. రాత్రి 11 గంటల తర్వాత పోలీసు బృందం మెహదీ మస్రూర్ ఉంటున్న ఏకైక గది అపార్టుమెంటుకు వెళ్లింది. అతను కంప్యూటర్ బల్లపై కూర్చున్నాడు. అంతే గాలింపు ముగిసింది. ఇదంతా 14 గంటల్లో ముగిసింది.












Click it and Unblock the Notifications