యుపిఎ ప్రేరేపితమే: లోకసభ ఘటనలపై అరుణ్ జైట్లీ

అలజడులతో ప్రజల ఆకాంక్షలపై పార్లమెంటు చర్చ జరపలేకపోతోందని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం పతనం దిశగా సాగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సామరస్యవూర్వకమైన పరిష్కారాన్ని కనుక్కోవడంలో యుపిఎ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ఆటంకాలు లేకుడా పార్లమెంటు సమావేసాలు నిర్వహించడం అరుదుగా మారిందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలే కాకుండా అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులే ఆందోళనలకు దిగుతున్నారని, సమస్యను పరిష్కరించడంలో ప్రధాని, హోం మంత్రి కార్యాలయాలు అచేతనంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.
యుపిఎకు చిత్తశుద్ధి ఉంటే సర్వసమ్మతి సాధించడానికి ఇంకా అవకాశం ఉందని జైట్లీ అన్నారు. చత్తీస్‌గడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటులో ఎన్డియె అందరికీ ఆమోదయోగ్యంగా ముందుకు సాగిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిల్లును యధాతథంగా ఆమోదిస్తే ఇరు ప్రాంతాలకు కూడా నష్టమేనని జైట్లీ అన్నారు.












Click it and Unblock the Notifications