121 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐటీబీపీ నోటిఫికేషన్
ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్‌ఫోర్స్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 121 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యరథులు జూన్ 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భారత్‌లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.
పోస్టు పేరు : కానిస్టేబుల్/జీడీ
ఖాళీలు : 121
దరఖాస్తుకు చివరి తేదీ : 21-06-2019
విద్యార్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణత
వయసు : 18 నుంచి 23 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ : విద్యార్హతల పత్రాల పరిశీలన, శారీరక సామర్థ్యం పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇచ్చారు.












Click it and Unblock the Notifications