శ్వేత వర్ణ షెర్వానీలో మెరిసిన ఇవాంక ట్రంప్: ముర్షిదాబాద్ పట్టుతో డిజైన్, కెమెరా కళ్లన్నీ ఆమె వైపే..?
అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ రెండోరోజు మెరిసారు. ట్రంప్ పర్యటనలో భాగంగా సోమవారం ఎర్రని డ్రెస్సు వేసుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు ఇవాంక ట్రంప్.. శ్వేత వర్ణ డ్రెస్సు వేసుకొని.. ఆ వస్త్రానికే అందం తీసుకొచ్చారు.

శ్వేతవర్ణం షెర్వానీ..
ఉదయం రాష్ట్రపతి భవన్ వద్దకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ వెనకాల తన భర్త జరెద్ కుష్నర్‌తో కలిసి ఇవాంక వచ్చారు. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా తెల్లని షెర్వాణీ ధరించారు. దీంతో ఆమెను మరోసారి ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు.

ముర్షిదాబాద్ పట్టు..
ఇండో వెస్ట్రన్ డిజైనర్ అనితా డొంగ్రే షెర్వానీని డిజైన్ చేశారు. ముర్షిదాబాద్ పట్టుతో తయారుచేసిన షెర్వానీని అందంగ డిజైన్ చేశారు. స్లివ్‌లెస్ కాకుండా నిండుగా.. భారతీయత ఉట్టిపడేట్టు అందులో ఇవాంక కనిపించారు. షెర్వానీని మెటాలిక్ బటన్లను పొందుపరిచారు. షెర్వానీ కింద కూడా స్ట్రెయిట్ ఫీట్ గల తెల్లని ప్యాంట్‌ను ఇవాంక ధరించారు. షెర్వానీ ధరించిన ఇవాకం వెంట్రుకలను వీరబోసుకొని కనిపించారు.

బెంగాల్ పట్టు
పశ్చిమబెంగాల్‌కి చెందిన ముర్షిదాబాద్ పట్టును వినియోగించానని అనితా డోంగ్రె తెలిపారు. ఈ పట్టును పురాతన కాలం మాదిరిగా చేతితో నేశారని తెలిపారు. వాస్తవానికి ఇలాంటి షేర్వానినీ ఇరవై ఏళ్ల క్రితమే తాము రూపొందించామని చెప్పారు. కానీ ఏళ్లు గడుస్తోన్నా ఇలాంటి షేర్వాని ఇప్పటికీ కూడా చూడచక్కగా ఉందని పేర్కొన్నారు. తనకు శ్వేత వర్ణంతోపాటు నలుపు, బ్లూ కలర్ అంటే ఇష్టమని పేర్కొన్నారు.

శక్తిమంతమైన మహిళలకు..
ప్రపంచంలో శక్తిమంతమైన మహిళలను అనిత డోంగ్రే వస్త్రాలను డిజైన్ చేస్తుంటారు. ఇదివరకు కేట్ మిడిల్‌టన్‌కు కూడా చేశారు. 2016లో ఆమె వచ్చిన సమయంలో డిజైన్ చేశారు. బెల్జియానికి చెందిన రాణి మథిదే, ట్రుడేకి చెందిన సోపి గ్రెగోయిర్ వస్త్రాలను కూడా డిజైన్ చేశారు. 2018లో భారత్ వచ్చిన సమయంలో హిల్లరీ క్లింటన్ వస్త్రాలను కూడా అనిత డిజైన్ చేశారు. ప్రపంచంలోని శక్తిమంతమైన మహిళలకు అనిత డిజైన్ చేస్తుంటారు. ఆ వరసలో ఇవాంక ముందుగానే తన పేరును నమోదు చేయించుకున్నారు.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..!












Click it and Unblock the Notifications