ఎదురుకాల్పులు: ఐదుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేయడానికి నిర్వహించిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు శనివారం ఐదుగురు మిలిటెంట్లను మట్టుబెట్టాయి. కుప్వారా జిల్లా చౌకిబల్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు.

శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మిలిటెంట్ల ఏరివేత కార్యక్రమం ఇంకా కొనసాగుతోందని సైనికాధికారి ఒకరు చెప్పారు. చౌకిబల్ ప్రాంతంలోని మర్‌సెరి గ్రామంలో గల ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు అందిన పక్కా సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం సాయంత్రమే ఆ ఇంటి పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి.

J&K: Five militants killed, army loses two soldiers in encounter

భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ఎదరుకాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైన కొద్ది సేపటికి శుక్రవారం సాయంత్రమే ఒక అధికారి సహా ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

గాయపడిన వారిద్దరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆ అధికారి శనివారం సాయంత్రం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+